హరికథలు చెప్పొద్దు


Fri,August 9, 2019 12:43 AM

-హరితహారంపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
-తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు
-కలెక్టర్ శ్వేతామొహంతి

పెబ్బేరు : సీఎం కేసీఆర్ భవిష్యత్తుతరాలను దృష్టి లో ఉంచుకుని సంకల్పించిన హరితహారంపై హరికథ లు చెప్పొద్దని ఉపాధి హామీ అధికారులపై కలెక్టర్ శ్వేతామొహంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని గుమ్మడం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జెడ్పీటీసీ పద్మతో కలిసి మొక్కలను నాటారు. పాఠశాలలోని ఆరో తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మా ట్లాడారు. గణిత పాఠ్యంశంలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ఆరో తరగతి విద్యార్థులు 12 గుణి తం, 14గుణితం తప్పులుగా చెప్పడంతో కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేస్తు గణిత టీచర్ తిరుపతి రెడ్డికి షోకాజ్ నోటీసుల జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం గుమ్మడం తండా, అయ్యవారిపల్లి, వెంకటాపూర్, బున్యాదిపూర్, సుగూర్ గ్రామాల రోడ్డు ఇరువైపుల తీసిన గుంతలు, నాటిన మొక్కలు, మొక్కల రక్షణ కవచాలను పరిశీలించారు. అనంతరం పట్టణ కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేసి అంతర్జాలంలో మాస్టర్లు, మొక్కలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలించిన దానికి ఆన్‌లైలో నమోదు చేసినదానికి పొంతనలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్‌పైన రాసిన రాతలమాదిరిగా క్షేత్రస్థాయిలో పని కనబడుట లేదని, హరితహారంపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మండలంలోని వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్‌అసిటెంట్లు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు విధి నిర్వాహనలో మార్పులేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. గ్రామాల్లో నాటిన మొక్కలు, మొక్కల కోసం తీసిన గుంతలు, టీగార్డులకు సంబంధించిన వివరాలు, అన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా చూపించకుండా పొంతనలేని సమాదానాలు చెప్పడంతో ఏపీవో బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏపీవో బాలయ్య, గుమ్మడం ఫీల్డ్ అసిస్టెంట్ సంగీత, రాంపూరం టీఏ మమతలను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. ఎంపీడీవో ఆంజనేయులు, మండల విద్యాధికారి జయరాములపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీడీ నాగశేషాద్రి, తాసిల్దార్ సునిత, పంచాయతీ రాజ్ శాఖ ఏఈ రమేశ్ నాయుడు, వివిధ గ్రామాల ఫీల్డ్ అసిటెంట్లు, టెక్నికల్ అసిటెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...