తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద


Fri,August 9, 2019 12:42 AM

అయిజ : కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. కర్నాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలకు తుంగ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా వచ్చి చేరుతుండటంతో దిగువన ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారం టీబీ డ్యాంలోకి లక్ష 31 వేల 602 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 4005 క్యూసెక్కుల నీటిని తాగునీటి ఆవసరాల కోసం కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 53.878 టీఎంసీలు నిల్వ ఉండగా, 1633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 1618.35 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.

ఎగువన వానలు భారీగా కురుస్తుండటంతో తుంగ ప్రాజెక్టుకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. శుక్రవారం నాటికి లక్ష 50వేలకు పైగా టీబీ డ్యాంలోకి చేరే అవకాశం మెండుగా ఉందని ఆయన పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...