ప్రతి చెరువుకూ నీరందిస్తాం


Fri,August 9, 2019 12:42 AM

మక్తల్ రూరల్ : మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు భీమా ఎత్తిపోతల పథకం ఫేజ్-1 ద్వారా సాగునీటిని నింపడంతో పాటు ఆయకట్టు భూములన్నింటినీ సస్యశ్యామలం చేస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన భూత్పూ రు జలాశయం నుంచి ఎడమ, కుడి కాలువల ద్వారా ఆయకట్టు భూములకు పేట జెడ్పీ చైర్‌పర్సన్ కె.వనజతో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాల్లో అంతర్భాగమైన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూరు జలాశయాల నుంచి గత ఏడాది దాదాపు 140చెరువులకు సాగునీటిని విడుదల చేసి లక్ష ఎకరాలను సస్యశ్యామలం చేశామన్నారు. ఈ ఏడాది కృష్ణానదికి పైనుంచి త్వరగా వరదనీరు వచ్చినందున మరిన్ని చెరువులకు సాగునీటిని అందిస్తామన్నారు.

కర్ణాటకలోని నారాయణపుర, ఆల్మట్టి డ్యాముల నుంచి అధిక మొత్తంలో వరదనీటిని దిగువకు వదులుతున్నందున నియోజకవర్గంలోని నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టపర్ల నర్సింహాగౌడ్, ఎంపీపీ వనజమ్మ, నర్వ ఎంపీపీ జయరాములు, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గుప్తా, వెంకట్రామిరెడ్డి, కృష్ణయ్యగౌడ్, చిన్నచెన్నయ్యగౌడ్, దత్తప్ప, మహేశ్వర్‌రెడ్డి, ఆనంద్ ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...