గద్వాలలో చోరీ


Fri,August 9, 2019 12:40 AM

గద్వాల క్రైం: గద్వాలలో గురువారం తెల్లవారు జామున చోరీ చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల మేరకు జిల్లా కేం ద్రంలోని అంబేద్కర్‌చౌరస్తా సమీపంలో శ్రీలక్ష్మీ బాలాజీ పెయిం ట్స్, దాని పైభవనంలో సురగంగ చిట్‌ఫండ్ (ఫైనాన్స్) ఉంది. బుధవారం ఎప్పటి మాదిరిగానే వీరు తమ విధులను ముగించుకొని ఇళ్ల కు వెళ్లారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారు జామున ముందుగా బాలాజీ పెయింట్ షాపు సమీప భాగం నుంచి లోపలికి చొరబడి కంప్యూటర్‌కు సంబంధించిన ఓ పరికరాన్ని, ఆ తర్వాత షాపు పై భాగాన ఉన్న చిట్‌ఫండ్‌లోకి ప్రవేశించి ఓ టేబుల్ బాక్స్‌లో ఉన్న రూ. 30 వేల నగదును దోచుకెళ్లారు. ఉదయం సం ఘటన విషయం తెలుసుకున్న యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సీఐ హనుమంతు, ఎస్సై సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి క్లూస్ టీం వచ్చి సంఘటన స్థలాన్ని నిశితంగా పరిశీలించి చోరీకి పాల్పడిన వ్యక్తుల వేలి ముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ చెప్పారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...