దూసుకొచ్చిన మృత్యువు


Mon,July 22, 2019 01:41 AM

రాజాపూర్: మండల పరిధిలోని కుచ్చర్‌కల్ గ్రామ సమీపంలో పశువులను కాస్తు రోడ్డు పక్కన ఉన్న పొ లంలో కుర్చున్న వ్యక్తులను ఇన్నోవ కారు ఢీకొట్టడంతో ఇద్దరువ్యక్తులు, ఒక బాలుడు మృతిచెందిన సంఘటన ఆది వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గోడుగు చంద్రయ్య (55), మంగళి రంగయ్య (60), యాదగిరి (20) అనే వ్యక్తులు తమ పశువులను రోడ్డు పక్కన ఉన్నా బీడుపొలంలో మేపుతు కుర్చున్నారు. ఈ క్రమంలో తిర్మలాపూర్ గ్రామం వైపునుంచి జడ్చర్లకు చెందిన శేఖర్‌రెడ్డి అనేవ్యక్తి తన ఇన్నోవా కారు మద్యం మత్తులో కారు నడుపుతూ వస్తుండగా కారు అదుపుతప్పి పొలంలోకి దుసుకొచ్చి కుర్చున్న పశువుల కాపరులను బలంగా ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్ర మా దంలో ముగ్గురు వ్యక్తులు సంఘటనస్థలంలోనే మృతి చెందారు. పక్కనే ఉన్న గ్రామస్తులు రోడ్డు ప్రమాదం విషయం గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు పారి పోతున్నా వాహనాన్ని వెంబడించి కేతిరెడ్డిపల్లి సమీపంలో పట్టుకొని నింధితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి. కుటుంబాలకు పెద్ద్దదిక్కున్న వారు మృతి చెంద డంతో బాధితు లకు న్యాయం చేసేవరకు మృతదేహాలను తరలించమని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు.

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
పెబ్బేరు: పేకాట ఆడుతున్న స్థావరాలపైన ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల మేర కు మండల పరిధిలోని బున్యాదిపూర్ గ్రామశివారులో గుట్టుగా పేకాట ఆడు తున్నారనే సమాచారంతో స్థావరంపై దాడులు చేసినట్లు తెలిపారు. ఈ దా డులలో శ్రీనివాసులు, స్వామి, మురళీతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని, స్థావరంలో రూ.27,730 నగదుతో పాటు ద్విచక్రవాహనలను స్వాధీనపర్చుకుని కేసునమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం వనపర్తి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...