మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మార్నింగ్‌వాక్


Mon,July 22, 2019 01:36 AM

కోస్గిటౌన్ : కోస్గి మున్సిపాలిటీలోని పలు వార్డులలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మార్నింగ్‌వాక్ చేశారు. ఆదివారం మున్సిపాలిటీలోని మున్నూర్‌వాడ, అట్కర్‌వీధి, తెలుగువీధి, ఎస్సీకాలనీల్లో పర్యటించారు. కాలనీల్లో పలుసమస్యలు నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాలనీల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో సత్వరమే కాలనీల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ రెండు రోజుల్లో పూర్తిచేసి తాగునీరందించాలని మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ శ్యామిల్‌ను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని మున్నూర్‌వాడ శివాంజనేయస్వామి ఆలయం ఆవరణలో షెడ్డు వేయించాలని ఎమ్మెల్యేను కాలనీవాసులు కోరడంతో వెంటనే తన ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులు మంజూరు చేసి షెడ్లు వేయిస్తానన్నారు. అనంతరం కాలనీలోని డ్రైనేజీ పను లు త్వరలో ప్రారంభించి మురుగు రోడ్లపై లేకుండా చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం లేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అన్న కిష్టప్ప, మాజీ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి నాయకులు రాజేశ్, కూర వెంకటయ్య, ఓంప్రకాశ్, బాల్‌రాజ్, వేణుగోపాల్, మాస్టర్ శ్రీనివాస్, వెంకట్ నర్సింహులు, నశీర్ ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...