లక్షలాది జీవితాలకు ఆసరా


Mon,July 22, 2019 01:36 AM

నారాయణపేట నమస్తే తెలంగాణ ప్రతినిధి/కోస్గి : ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల వల్ల లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఎక్సై జ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభు త్వం ఎన్నికలకు ముందు, తర్వాత ప్రజలకు ఇచ్చి న హామీల కన్నా ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో రూ. 15 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీలు ఈ రాష్ర్టాన్ని 70 సంవత్సరాలు పరిపాలించాయని, వారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం ఇవ్వలేకపోయాయన్నారు. రైతుల కు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. రూ.200ల పింఛన్ కోసం నానా ఇబ్బందులు పడేవారని గు ర్తు చేశారు. కన్న బిడ్డల ఆదరణకు నోచుకోక ఎం తో మంది వృద్ధులు వీధులపాలయ్యారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత అందరికీ ఆసరా కల్పించాలనే ఉద్దేశంతో మొదట్లో రూ.1000 అందజేసి ఇప్పుడు రూ. 2016లను అందజేస్తుందన్నారు. వికలాంగులకు రూ.3016 చొప్పున పింఛన్లను అందజేస్తుండడంతో వారందరూ ఎవరిపై ఆధార పడకుండా ఆ నందంగా గడిపే అవకాశాలు కలిగాయన్నారు. 24 గంట ల విద్యుత్, పేద పిల్లలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత మన ప్రభు త్వానికే దక్కుతుందని మంత్రి తెలిపారు. రైతులకు రైతుబంథు పథకాన్ని ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా సాగించే అవకాశాలను రాష్ట్ర ప్రభు త్వం కల్పించిందన్నారు. రానున్న రోజులలో పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సాధించి ప్రతి ఎకరాలో పంటను పండించేలా చర్యలు చేపడతామని మంత్రి వివరించారు. అప్పుడే వ్యాపారాత్మకంగా మనం అభివృద్ధిని సాధించగలుగుతామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ , టీఆర్‌ఎస్ కార్య నిర్వాహణ అధ్యక్షులు కేటీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని మంత్రి చెప్పారు. కోస్గి మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాల్టీగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు మండలాల అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానని జెడ్పీ చైర్ పర్సన వనజ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు అన్ని మండలాలతో స మానంగా ఈ రెండు మండలాలకు నిధులను కేటాయిస్తామన్నా రు. రానున్న రోజులలో ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
కోస్గిని సుందరంగా రూపొందిస్తాం : ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కోస్గి మున్సిపాల్టీని సుందరంగా రూపొందించేందుకు అన్నివిధా లా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. రూ.400 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పుడు మరో రూ.15 కోట్లతో కోస్గి ము న్సిపాల్టీలో కూరగాయాల మార్కెట్‌తోపాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ కార్య నిర్వాహఖ అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ల సహాయ సహకారాలతో కోస్గి మున్సిపాల్టీలో రోడ్ల నిర్మాణాలు, మురుగునీటి కాల్వల ఏర్పాటు, లైట్ల ఏర్పాటు వంటి పనులు చేపడతామన్నారు. రేవంత్ జోకర్‌లా మాట్లాడడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని, అటువంటి వారి మాటలను ప్రజలు పట్టించుకోకుండా అభివృద్ధికి అండగా నిలవాలన్నారు.

అర్హులైన ప్రతిజర్నలిస్టులకు డబుల్‌బెడ్రూం ఇండ్లు
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్‌బెడ్రూం ఇళ్లు మంజూరీ చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నూతన జర్నలిస్టుల కాలనీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని 1856 సర్వే నెంబర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలంలో ప్రతి జర్నలిస్టుకు ఇళ్ళ స్థలంతో పాటు డబుల్‌బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతిఒక్క జర్నలిస్టు పనిచేసే నాయకులను, ప్రభుత్వాలను గుర్తించి ప్రభుత్వానికి, ప్రజలకు చక్కటి వారధిగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అన్నకిష్టప్ప, మాజీ ఎంపీటీపీ రాజేష్, ఆర్‌డీవో శ్రీనివాసులు,కోస్గి మండల జర్నలిస్టులు సల్మాన్‌రాజ్, వెంటకరమణారెడ్డి, మోహన్, శేఖర్, అబ్దుల్ అజీజ్, ఆథిక్, శంకర్, నరేష్, మల్లేశ్, వెంకట్, సమీర్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...