సిమెంట్ బెడ్ పనులను వెంటనే పూర్తిచేయాలి


Mon,July 22, 2019 01:34 AM

మక్తల్ రూరల్ : మక్తల్ నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భీమా ఎత్తిపోతల పథ కం కెనాల్ వద్ద జరుగుతున్న సిమెంట్ బెడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధికారులు, గుత్తేదార్లను ఆదేశించారు. మక్తల్ మండలంలోని చిన్నగోప్లాపూర్ పంప్‌హౌజ్ నుంచి భూత్పూరు, సంగంబండ రిజర్వాయర్లకు సాగునీటిని అందించే కెనాల్‌కు చేపట్టిన సిమెంట్ బెడ్ పనులను భూత్పూరు వద్ద ఆదివారం ఆయన ప్ర త్యేకంగా పరిశీలించారు. కృష్ణానది ఎగువ భాగాన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువన ఉన్న తెలంగాణకు త్వరలోనే వరదనీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున కాలువల ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. పైనుంచి వరద ప్రారంభమైతే జూరాల బ్యాక్ వాటర్‌లో భాగమైన పంచదేవ్‌పహాడ్ కెనాల్ నుంచి చిన్నగోప్లాపూర్‌కు, అక్కడి నుంచి భూత్పూరు, సంగంబండలకు వరదనీటిని పంపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...