ఆధునిక విజ్ఞానంతో పరిశోధనలు చేయాలి


Sat,July 20, 2019 06:09 AM

పాలమూరు యూనివర్సిటీ : ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిశోధనలు చేయాలని పాలమూరు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య భూక్యా రాజారత్నం అన్నారు. శుక్రవారం పాలమూరు విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫార్మసీ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీలో డ్రగ్స్ తయారు చేయడానికి నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని, వాటిని ఉపయోగించి వ్యాధిని ముందే కనుగొనే అవకాశం కలిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యకు ఎంత ఖర్చయినా పెట్టడానికి వెనుకాడడం లేదని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. జాతీయ సెమినార్‌ల వల్ల అనుభవాలను పంచుకోవచ్చని వివరించారు. పరిశోధన రంగంలో ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని డ్రగ్స్ తయారీలో కొత్త ఒరవడి తీసుకు రావాలని పేర్కొన్నారు. పాలమూరు విశ్వ విద్యాల యంలో చదివిన ప్రతి విద్యార్థి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని సూచించారు. పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పిండి పవన్‌కుమార్ మాట్లాడుతూ బ్యాక్టీరియా వలన మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి వ్యక్తి ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ లెవల్ అధికంగా ఉండడంతో షుగర్, బీపీ బారినపడి రోగాలు అధికం చేసుకుంటున్నారన్నారు. ముందు జాగ్రత్తగా రోగ నిర్వహణకు డ్రగ్స్ తయారు చేయాలని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, నూతన పరిశోధనల ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం విద్యార్థులపై ఉందన్నారు. ప్రతి విద్యార్థి ఒక సైంటిస్ట్‌గా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నేహోటి టెక్నాలజీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.వెంకటేశ్వర్లు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నూర్జాహన్, సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సంధ్యాతివారి, యూనివర్సిటీ అధ్యాపకులు, భూమయ్య, జైపాల్‌రెడ్డి, కిశోర్‌కుమార్, సురేశ్, అర్జున్ కుమార్, వివిధ విభాగాల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...