చిరుధాన్యాలపై శ్రద్ధ వహించాలి


Sat,July 20, 2019 06:07 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: వ్యవసాయంలో లాభాదాయకంగా ఉండే చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక శ్రద్ధ రైతులు చూపించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ), వ్యవసాయ, ఉధ్యానవన, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరుధాన్యాల విత్తనాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు పండించిన చిరుధాన్యాలతో తదితర పంటల విక్రయాల గుర్చి ఆన్‌లైన్ విక్రయాలను కూడ రైతుల కుటుంబాల విద్యార్థులకు అవగతం కల్పించాలని సూచించారు. అధికారులు మరింత ప్రత్యేక శ్రద్ధ్ద వహించి రైతులకు అవగాహన కల్పిస్తు ముందుకు సాగితే చిరుధాన్యాలతోపాటు తదితర పంటలను సాగు చేసుకుంటు రైతుల లాభదాయకంగా పంటలను సాగు చేసే అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖలకు రూ. 43,52,000 నిధులను విడుదల చేసినట్లు తెలియజేశారు. నిధులను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికల బద్ధంగా రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. జేడీఏ సుచరిత, ఉధ్యాన శాఖ జిల్లా అధికారి సరోజినిదేవి, పశు సంవర్ధక శాఖ అధికారి మధుసుధన్‌గౌడ్, మత్స్య శాఖ అధికారి లక్ష్మమ్మప్ప, మార్కెటింగ్ శాఖ డీఎంవో భాస్కరయ్య, సంబంధింత అధికారులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...