ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత


Fri,July 19, 2019 03:37 AM

వనపర్తి రూరల్ : మండలంలోని సవాయిగూడెం గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం ఆశా వర్కుర్లు అందించిన ఐరన్ మాత్రలు వికటించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ఉపాధ్యా యులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటలకు గ్రామంలోని ఆశా వర్కర్లు భారతి, వెంకటేశ్వ రమ్మలు ఉన్నత పాఠశాలకు చెందిన 63 మంది బాల బాలికలకు ఐరన్ మాత్రలు అందించారన్నారు. వాటిని భోజనం చేసిన తరువాత వేసుకోవాల్సింది పోయి, ముందే వేసుకోవటం వల్ల మధ్యాహ్నం భోజనం అయిన రెండు గంటల తరువాత విద్యార్థులలో ఒక్కసారిగా కడుపు నొప్పి ప్రారంభమైందన్నారు. అందులో దాదాపుగా 32 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బంది పడ్డారు. వెంటనే 108 అంబులెన్స్, గ్రామంలోని ఆటోలో విద్యార్థులను జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విద్యార్థులను పరిశీలించి, చికిత్స అందించిన వైద్యులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మండల ఎంపీపీ కిచ్చారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధ్ర రావు జిల్లా ప్రభుత్వ దవాఖానకు చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని, వారికి దైర్యాన్నిచ్చారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...