ఎస్పీ చొరవ అపూర్వాఎం


Thu,July 18, 2019 04:26 AM

నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచారు వనపర్తి ఎస్పీ అపూర్వారావు. ఎస్సై ఉద్యోగాలకోసం సిద్ధమయ్యేవారికి ఎస్పీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత శిక్షణ కేంద్రం వరంగా మారింది. మొత్తం ఎనిమిది మంది ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 400 మందికి పైగా విద్యార్థుల్లో 99 శాతం మంది దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఫైనల్ పరీక్షలో ఎనిమిది మంది ఎస్సైలుగా ఉద్యోగాలు సాధించి వనపర్తి జిల్లాకే వన్నె తెచ్చారు. ఎస్పీ ప్రత్యేక చొరవపై జిల్లా వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు..

-ఉచిత శిక్షణతో పలువురికి ఎస్సై ఉద్యోగాలు
-అన్ని సబ్జెక్టులపైనా పట్టుసాధించేలా తర్ఫీదు
-400 మంది విద్యార్థుల హాజరు
-పేదలకు సేవలందించడంలో ముందుండాలి : ఎస్పీ అపూర్వరావు

వనపర్తి విద్యావిభాగం: ఎంత ఉన్నత శిఖరాలు అధిరోహించినా.. మానవత విలువలు, విలువలతో కూడిన విద్య ఉంటే ఎంతోమందిని తీర్చిదిద్ది సమాజంలో ప్రయోజకులుగా తయారు చేసే ఔనత్యాన్ని చాటిచెప్పింది వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు. గ్రామీణస్థాయి నుంచి పట్టణాల్లో విద్యాభ్యాసం చేసి జిల్లాస్థాయిలో ఓ అధికారిణిగా విధులు నిర్వహిస్తు సమాజహితం కోరి తనకున్న వనరులను, సదుపాయాలను కల్పించుకునే నేటి యువతను తీర్చిదిద్దడంలో తోడ్పాటు అందిస్తున్నారు. యువత విజయాలు సాధిస్తే భవిష్యత్ తరాలకు ప్రయోజపకారులుగా పనికొస్తారని తలంచి వారు జీవితంలో సఫలీకృతులు కావడానికి చేయూత, తోడ్పాటు అందించడంలో భాగంగా గ్రామీణ నిరుపేద యువతీ యువకులకు పోటీ ప్రపంచంలో మెరుగైన వారిగా తీర్చిదిద్ది నైపుణ్యాలను పెంపోందించేందుకు ఉచిత శిక్షణ అందించారు.

ఆరునెలలపాటు శిక్షణ


రాష్ట్రంలో ఆయా సబ్జెక్టులలో ప్రావీణ్యం కలిగిన వారిని పట్టణాల నుంచి పల్లెలకు రప్పించి ఆరునెలల పాటు గ్రామీణ పేద నిరుద్యోగ యువతీయువకులకు హిందీ బీఈడీ కళాశాలలో, బ్రహ్మాంగారి కల్యాణ మండపంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు ఈ శిక్షణ కొనసాగింది. మెంటల్ ఎబిలిటీ, రిజనింగ్, కరెంట్ అఫైర్స్, జీకేలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాందించి విజేతలుగా నిలిచేలా శిక్షణ ఇచ్చారు. చాలామంది విద్యార్థులు పరీక్షల్లో రాణించి, శారీరక దారుఢ్య పరీక్షలో విఫలం చెంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్న తరుణంలో వనపర్తిలో ఉన్న బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ప్రత్యేక ఉద్యోగులను రాజాగౌడ్, పాషను నియమించడంతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో నిరంతరం శిక్షణ ఇచ్చారు. ఏకలవ్యుడి మాదిరిగా శారీరకదారుఢ్య పరీక్షలకు ఎవ్వరికి వారు సన్నద్ధమవుతున్న తరుణంలో ఎస్పీ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం వారికి వరంలా మారింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిఒక్కరూ విజేతలుగా నిలిచేలా సరైన మెళకువలు అందించారు.

మాదిరి పరీక్షలు

శరీరదారుఢ్య పరీక్షల్లో ప్రతిఒక్కరూ విజేతలయ్యేలా పోలీస్ శాఖ నిర్వహించే ఎత్తు, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, లాంగ్‌జంప్, హైజంప్, పరుగు పందెంను ముందుగానే నిర్వహించి వైఫల్యం చెందిన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తు విజేతలయ్యేలా మనోధైర్యాన్ని నింపారు. దేహదారుఢ్య పరీక్షలో దాదాపుగా 400 పై చిలుకు నిరుద్యోగ యువతీయువకులు పాల్గొనగా 99 శాతం విజేతలుగా నిలిచారు. దీంతో ప్రతిఒక్కరిలో సామర్థ్యాల పెంపుతోపాటు వారిలో మనోధైర్యాన్ని ఇస్తు విజేతలుగా నిలిపేందుకు ఎంతగానో దోహదపడింది. ఫైనల్ పరీక్షలో ఎనిమిది మంది ఉత్తీర్ణులై ఎస్సైలుగా ఉద్యోగం సాధించారు.

జీకే, కరెంట్ అఫైర్స్‌తో విజయానికి మార్గం సుగమం

నిరుద్యోగ యువతీ యువకులు ఆయా సబ్జెక్టులలో మార్కులు సాధించినప్పటికీ కరెంట్ అఫైర్స్, జీకే విభాగంలో ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో వారు విజేతలుగా నిలిచేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రావీణ్యత గల, నిష్ణాతులైన శిక్షకుడు మట్టపల్లి రాఘవేంద్రతో ఫిబ్రవరిలో దాచలక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో ఉచిత శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సుమారుగా 1500 మంది హాజరై పలు ఆంశాలలో పట్టు సాధించి విజేతలుగా నిలిచారు. శిక్షణ ద్వారా విజేతలుగా నిలిచి ఉద్యోగాలు పొందిన వారి మనసులో మాట ఇలా..

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...