మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు


Thu,July 18, 2019 04:18 AM

కొల్లాపూర్‌టౌన్: మున్సిపాలిటీ అభివృద్ధికి తన హయాంలో అని విధాలుగా చర్యలు తీసుకున్నానని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అభివృద్ధి పనులు పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని 8,9 వార్డులతో పాటు పాత పోలీస్‌స్టేషన్, నగర పంచాయతీ ఏరియాలో జూపల్లి పర్యటించి ఇంటింటికీ వెళ్లి తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో సమర్థవంతమైన వారికి కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తామని వారిని గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు నర్సింహ్మారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ సుదర్శనచారి, దూరయ్య, రమేశ్‌గౌడ్,సత్యం, మహేశ్,రామదాసు, రమేశ్, వెంకటేశ్, పాల్గొన్నారు.

గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించాలి
మండలంలోని నల్లమల్ల సరిహద్దు గ్రామాలైన మొలచింతలపల్లి, నార్లాపూర్,ముక్కిడిగుండం, తదితర ప్రాంతాల్లో గిరిజన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ జెడ్పీటీసీ కోరారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని జూపల్లి నివాసంలో గిరిజనులు ఆయనతో సమావేశమయ్యారు. కొన్ని ఏండ్లుగా భూములు సాగు చేస్తున్నామని ప్రస్తుతం అటవీశాఖ అధికారులు అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించిన న్యాయం చేయాలని వారు కోరారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...