మన భరోసా అందించండి


Wed,July 17, 2019 05:52 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: భూ సమస్యలే కాదు ప్రజా సమస్యలు అన్నియూ మనం పరిగణలోకి తీసుకుంటూ మన పరిధిలో మనం చేయాల్సిన ప్రతి సమస్యను పరిష్కరింకుంటూ ప్రతి ఒక్కరికీ మన భరోసా అందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌నందు వివిధ మండల రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మా భరోసా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. అధికారులంటే డబ్బులు తీసుకుని పనులు చేస్తారు అనే చెడ్డపేరును పూర్తిగా తొలగించేందుకు ప్రతి అధికారి శయక్తులుగా కృతనిశ్చయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండ ప్రతి పనిని పూర్తి పరిపక్వతతో చేయాలని స్పష్టం చేశారు. మా బరోసాకు అందిన ప్రతి ఫిర్యాదును తమ తమ పరిధివి ఉంటే వారికి తక్షణమే పంపించడం జరుగుతుందని, అధికారులు సమస్యలతో వచ్చిన వారందరికీ భరోసా అందించాల్సిన బాధ్యత మీపై ఉంటుందన్నారు. ఎక్కడైన నిర్లక్ష్యంగ వ్యవహరించారని తమ దృష్టికి వస్తే బాధ్యులపై చర్యలు ఉంటాయనే విషయాన్ని గమనించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ప్రేమ్‌రాజ్, అధికారులు బక్కశ్రీనువాసులు, తదితరులు ఉన్నారు.

మా భరోసాకు 50 ఫిర్యాదులు
మూడు రోజుల్లో 206 పిర్యాదులు, 47 పరిష్కారం
మా భరోసా గత శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో ముడు పనిదినాలల్లో మొత్తం 206 ఫిర్యాదులు మా భరోసాకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆయా మండలాలు అన్ని కలిపి అందిన ఫిర్యాదుల్లో అధికారులు 47 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది. వీటిలో కేవలం నాల్గు ఫిర్యాదులు మాత్రం ఇతర శాఖల పరిధివి అని ఆ సమస్యలను కూడ సంబంధింత శాఖల అధికారులు స్పందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పెండింగ్ ఫిర్యాదులను పరిష్కారమార్గం చూపించాలని ఆదేశించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...