విద్యారంగ అభివృద్ధికి కృషి


Mon,July 15, 2019 02:52 AM

పాన్‌గల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గు రుకులాలు దేశానికే తలమానికంగా మారాయని, విద్యారంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దొండాయిపల్లి గ్రామంలో రూ.18 లక్షల వ్యయంతో నిర్మించనున్న జీపీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి భూమి పూ జ చేశారు. అలాగే అన్నారం గ్రామంలో సర్వశిక్షా అభియాన్‌ నుంచి విడుదలైన నిధులు రూ. 14.80 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాలను ప్రారంభించారు. అలాగే పాన్‌గల్‌ మండలకేంద్రంలో అదనపు గదుల నిర్మాణానికి, కేతేపల్లి గ్రా మంలో రూ.18 లక్షల వ్యయంలో నిర్మించనున్న జీపీ భవనానికి భూమి పూజ చేశారు. శాగాపూర్‌ గ్రామంలో ఇటీవల నిర్మించిన నూతన బ్రిడ్జిని ప్రా రంభించారు. అనంతరం మండల కేంద్రంలో లబ్ధిదారులకు రైతు పాస్‌ పుస్తకాలు, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మం త్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని అన్నారు. గురుకులాల్లో కార్పొరేట్‌ స్థాయికి మించి విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించేందుకు 600 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి ఏడాదికి లక్షా ఇరవైవేలను తెలిపారు. ఈ పాఠశాలల్లో విద్యను డిగ్రీ, పీజీ వరకు అప్‌గ్రేడ్‌ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పారు.

పేదల ఇండ్లల్లో ‘కల్యాణ లక్ష్మి’ కాంతులు
రాష్ట్రంలోని ఆడపడుచుల తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ పథకాల వల్ల పే దల ఇండ్లల్లో కల్యాణ కాంతులు చోటు చేసుకుంటున్నాయని, అప్పులు లేకుండా సంబురంగా పె ళ్లిళ్లు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఆడపిల్లల వివాహాలు జరిపించాలంటే పేదలు భారంగా భావించి జంకే పరిస్థితి ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం..
బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫ లాలు ప్రజలందరికీ చేరేలా ప్రజాప్రతినిధులు, అ ధికారులు పాటుపడాలని కోరారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, పరిపాలన సంస్కరణల కోసం కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు, హరితహారం, నిరంతర విద్యుత్‌, రైతు బంధు, రైతుబీమా ఇలా గడిచిన ఐదేళ్లుగా ప్రవేశపెట్టిన ప్రతి పథకం వెనుక సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 20 ఏళ్ల కిందట కన్న కలలు ఉన్నాయని తెలిపారు.

అన్నదాతలకు రైతుబంధు ఓ వరం..
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కో సం రైతును కేంద్ర బిందువుగా చేసుకొని రైతుబం ధు, బీమా పథకాలను అమలు చేస్తుండడంతో రైతులకు వరంగా మారాయని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుకు సాంత్వన చేకూర్చేందుకే రై తు సమగ్ర సర్వే చేపట్టి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొదటి దశలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అడ్డంకులు తొలగిపోయాయని, త్వరలో నిర్మాణ పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. రైతు బంధు డబ్బులు చెల్లింపు విషయంలో రైతులు ఎలాంటి అపోహాలకు గురికావద్దని, ప్రభుత్వం త్వరలోనే డబ్బులను చెల్లించడం జరుగుతుందని తెలిపారు. పొల్కి చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు ఇదివరకే పంపడం జరిగిందని తెలిపారు. డబుల్‌రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామస్వరాజ్య సాధనకు ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి
గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్య స్థాపనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలను అందించడం జరిగిందని తెలిపారు. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని ప్రభుత్వం సరిపడా నిధులను మంజూరు చేయ డం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు అభిలాష్‌రావు, చంద్రశేఖర్‌నాయక్‌, ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మి, వైస్‌ ఎంపీపీ కవిత, తాసిల్దార్‌ శ్రీరాములు, ఆర్‌ఐ బాల్‌రాంనాయక్‌, ఎంఈవో లక్ష్మణ్‌నాయక్‌, సర్పంచులు శ్యామలమ్మ, రాములు, గోపాల్‌రెడ్డి, మౌనిక, అనిత, ఎంపీటీసీలు లక్ష్మిఠాకూర్‌నాయక్‌, భాస్కర్‌రెడ్డి, హైమావతి, శ్యామల, బాలస్వామి, కర్ణాకర్‌రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ హలీంపాష, నాయకులు గాల్‌రెడ్డి, దశరథనాయుడు, సుధాకర్‌యాదవ్‌, వీరసాగర్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...