మతోన్మాద విష కౌగిలిలో భారత ప్రజాస్వామ్యం


Mon,July 15, 2019 02:51 AM

- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపాల్‌
వనపర్తి క్రీడలు : భారత ప్రజాస్వామ్యంలో మతోన్మాద చర్యలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపాల్‌ అన్నారు. ఆదివారం సీపీఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో పార్టీ సభ్యులకు రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత ఉన్మాద చర్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, మైనార్టీలపై, దళితులపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో కార్మికులను, రైతులను విస్మరించిందని, బడా పెట్టు బడిదారులకు రుణాలు మాఫీ చేసెందుకు బడ్జెట్‌ కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, కమిటీ సభ్యులు కురుమయ్య, మదన్‌, రమేశ్‌, బాలస్వామి, బీసన్న, రాములు, రాబర్ట్‌, భాస్కర్‌, పెంటయ్య, మణ్యం, మహేశ్‌, నారాయణ గౌడ్‌, కురుమయ్య, దేవరాజు, వీరేందర్‌, రత్నయ్య, బాలరాజు, ఉమ, సుగుణమ్మ పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...