జర్నలిస్ట్‌ బాలస్వామి మృతి పట్ల సంతాపం


Mon,July 15, 2019 02:50 AM

- మంత్రి సహకారంతో మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
పెద్దమందడి : మండలంలోని దొడగుంటపల్లి గ్రామానికి చెందిన విలేకరి బాలస్వామి ఇటీవల అనారోగ్యానికి గురై మృతిచెందాడు. ఆదివారం గ్రామంలో ఆయన నివాసం గృహం వద్ద ఏర్పాటు చేసిన దశదినకర్మ కార్యక్రమానికి జిల్లా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) అధ్యక్షుడు మధుగౌడ్‌, పెద్దమందడి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కొండన్నయాదవ్‌, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు రవీందర్‌రెడ్డి, రమేశ్‌లు హాజరై బాలస్వామి చిత్రపటానికి పూలుజల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబాలను ఓదార్పునిచ్చి మాట్లాడారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకుల సహకారంతో బాలస్వామి కుటుంబాన్ని ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. వీరితో పాటు జర్నలిస్ట్‌లు గోపాలచారి, వెంకట్‌గౌడ్‌, గోపాల్‌, ఆంజి, మాజీ ఎంపీపీ మన్నెపురెడ్డి, గ్రామస్తులు శ్రీనివాస్‌రెడ్డి, కురుమయ్య, సుదర్శన్‌, నిరంజన్‌లు నివాళులు అర్పించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...