వీడని ఉత్కంఠ!


Mon,July 15, 2019 02:50 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని ఐదు మన్సిపాలిటీల వారీగా తుది ఓటరు జాబితాలను ఆదివారం ప్రకటించాల్సి ఉంది. ముందుస్తుగా నిర్ణయించిన ప్రకారం తుది ఓటరు జాబితాతోపాటు వివిధ కులాల వారీగా ఓటర్ల వివరాలను ప్రకటించాల్సి ఉంది. అయితే, చివరి ఓటర్ల జాబితాలను 16వ తేదీకి వాయిదా వేశారు. మరో రెండు రోజుల గడువుతో పూర్తిస్థాయి జాబితాను సిద్ధం చేసేందుకు మున్సిపల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన అనంతరం పోలింగ్‌ కేంద్రాలపై వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం, అభ్యంతరాలు, ఆ తర్వాత చివరగా పోలింగ్‌ కేంద్రాల ప్రకటనను చేసేలా ప్రణాళిక ఉంది. ఎలాంటి ఫిర్యాదులు లేకుంటే ఇప్పుడు నిర్ణయించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే తయారు చేసిన ఓటర్ల జాబితాను ప్రకటించిన అధికారులు, అందులో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చివరి జాబితాను ప్రకటించనున్నారు. వీటి పరిశీలనకు మరికొంత సమయం అవసరమైనందునా గడువు పొడగింపు తప్పనిసరి అయింది.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...