దరఖాస్తులకు ఆహ్వానం


Mon,July 15, 2019 02:50 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణకు అర్హతగల గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఎన్‌ కిశోర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు హాస్టల్‌, భోజన వసతి కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పదో తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన అభ్యర్థులకు ఆటోమొబైల్‌ రంగంలో 2,3 విల్లర్స్‌ సర్వీసింగ్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల మరమ్మతు, మెయింటనెన్స్‌పై మూడున్నర నె లల శిక్షణ, ఎలక్ట్రీషియన్‌ (డిమెస్టిక్‌) నాలుగు నెలల శిక్షణ ఉం టుందని తెలిపారు. అలాగే, ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు డీటీపీ, ఫ్రింట్‌ పబ్లిసింగ్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అ సిస్టెంట్‌, బీకాం ఉత్తీర్ణులైన వారికి అకౌంట్స్‌ అసిస్టెంట్‌ (ట్యాలీ), ఇంటర్‌ పాస్‌, ఐటీఐ చేసిన వారికి సోలార్‌ సిస్టం ఆన్‌ సప్టలేషన్‌, సర్వీస్‌, పదో తరగతి పాస్‌ అయిన వారికి టైలరింగ్‌ మెషిన్‌ ఆపరేటర్‌ శిక్షణ మూడున్నర నెలలపాటు ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువ పత్రాలతో ఈనెల 16న యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌కు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9133908000ను సంప్రదించాలని తెలిపారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...