ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి


Mon,July 15, 2019 02:50 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : వివిధ పోటీ పరీక్షల్లో ప్రతిభకనబర్చిన నాయీబ్రాహ్మణ విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని నాయీ మిత్ర మండలి రాష్ట్ర కన్వీనర్‌ అశ్విని చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయీమిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన నాయీబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 2018-19 విద్యాసంవత్స రం పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్‌లో 850 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులతోపాటు, నీట్‌, ఎంసెట్‌-2019, ట్రిపుల్‌ ఐటీ తదితర పో టీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారు, గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ప్రతిభా పురస్కారాల కోసం ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం 9440701810 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...