మహిళలు మహారాణులు


Sun,July 14, 2019 01:57 AM

-మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు
-పెరగనున్న మహిళల ప్రాతినిధ్యం
-జిల్లాలోని 41 వార్డుల్లో అవకాశం
-అత్యధికంగా వనపర్తిలో 17 స్థానాలు కేటాయింపు
-మండల, జిల్లా పరిషత్‌ల్లోనూ పెరిగిన ప్రాధాన్యం

వనపర్తి, నమస్తేతెలంగాణ ప్రతినిధి;మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో రాజకీయాల్లోనూ తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగా సగం స్థానాలను అతివలకే కేటాయించనున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 80 వార్డులున్నాయి.. వీటిలో దాదాపుగా 41 వార్డులు మహిళలకు కేటాయించనున్నారు.. వనపర్తిలో 17, కొత్తకోటలో 8, పెబ్బేరులో 6, ఆత్మకూరులో 5, అమరచింతలో 5 వార్డులు మహిళలకు ఇవ్వనున్నారు. దీంతో బరిలో నిలిచేందుకు ఆశావహులు కాలనీవాసులతో మమేకమవుతున్నారు..

50 శాతం రిజర్వేషన్ మేలు..
మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. ఏ సభలోనైనా.. సమావేశంలోనైనా మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. రాజకీయంగానే కా కుండా విద్యాపరంగాను రిజర్వేషన్ అమలవుతున్నందునా ఉద్యోగాల్లోనూ మహిళలకు ప్రా ధాన్యత ఏర్పడింది. 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలుతో ప్రజా ప్రతినిధులుగా మహిళలు కనిపిస్తున్నారు.

వనపర్తి, నమస్తేతెలంగాణ ప్రతినిధి : మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ మేరకు పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం రూపం దాల్చింది. స్థాని క సంస్థలు, పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లోను 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టం అమలులోకి రావడంతో వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈమేరకు వివిధ ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు మహిళలకు కల్పి స్తు వస్తున్నారు. గత మున్సిపల్ కౌన్సిల్‌లోనూ మహిళలకు రిజర్వేషన్లను అమలు చేశారు. 50 శాతం రిజర్వేషన్ల ఫలితంగా మహిళా ప్రాధాన్యత గతంలోకంటే పెరుగుతుంది. మండల, జిల్లా పరిషత్‌లో 50 శాతం మహిళలు కొలువు దీరారు. ఇక వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లోను నారీమణుల హవా కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న క్రమంలో రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు ఔత్సాహికులు ఉత్సాహంతో ఉన్నారు. పెరుగుతున్న జనాభాతోపాటు గ్రామాల విలీనంతో మున్సిపాలిటీలు కొత్త రూపును సంతరించుకున్నాయి. జిల్లాలో వనపర్తితోపాటు పెబ్బే రు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలున్నాయి. వీటిలో ఒక్క వనపర్తి మినహా మిగితావన్నీ కొత్తగా ఏర్పాటైన మున్సిపాల్టీలు.

41 వార్డులు మహిళలకే..
ఐదు మున్సిపాలిటీల్లో 80 వార్డులుంటే.. వీటిలో దాదాపు 41 వార్డులు మహిళలకే కేటాయించే అవకాశం ఉంది. వనపర్తి మున్సిపాల్టీలో 17 వార్డులు, కొత్తకోటలో 8, పెబ్బేరులో 6, ఆత్మకూరులో 5, అమరచింతలో 5 వార్డులు మహిళలకు కేటాయించనున్నారు. ఇలా అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం రాజకీయరంగంలోను ప్రజా ప్రతినిధులుగా 50 శాతం అవకాశం కల్పించడంతో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇప్పటికే 255 గ్రామ పంచాయతీలకు గాను 128 మంది మహిళలే సర్పంచులుగా ఉన్నారు. అలాగే 128 ఎంపీటీసీ స్థానాలకు 71 స్థానాల్లో నారిమణులే ప్రాతినిధ్యం ఉంది. ఇంకాను జిల్లాలో 14 జెడ్పీటీసీ స్థానాలకుగాను ఏడుగురు మహిళలు జెడ్పీటీసీలుగా కొనసాగుతున్నారు. ఇలా పల్లె నుంచి పట్నం దాకా ప్రజా ప్రతినిధుల వ్యవస్థలో మహిళలకు సర్కార్ ప్రాధాన్యం పెంచింది. దీంతో త్వరలో ఏర్పడనున్న కౌన్సిల్‌లో పురుషుల కంటే మహిళల స్థానాలే అధికంగా ఉండనున్నాయి. ఓటర్ల సంఖ్య ప్రకారం రిజర్వేషన్లను ప్రకటించినా ఆయా కేటగిరిల వారీగా సగం సీట్లు వారికి తప్పనిసరిగా కేటాయించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఔత్సాహికులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

బరిలో నిలిచేందుకు పోటాపోటీ
మున్సిపాలిటీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతోపాటు పోటీలో నిలవాలని అనేకమంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఎన్నికల హడావిడి మొదలైనక్రమంలో కాలనీవాసులతో మమేకమౌతు వారి మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, రిజర్వేషన్ అనుకూలించకపోతే నిరుత్సాహానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. పోటీ దారులు ఆశిస్తున్న వార్డుల్లో ఇతర వర్గాలకు రిజర్వేషన్లు వస్తే బరిలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ, అవే వార్డులు మహిళలకు రిజర్వు అయితే మాత్రం వారి భార్యలను బరిలోకి దింపేందుకు వ్యూహ ప్రతివ్యూహాలను చేసుకుంటున్నారు. జిల్లాలో వనపర్తి మున్సిపాల్టీలో 26 వార్డులుండగా, ప్రస్తుతం 33 వార్డులయ్యాయి. అలాగే కొత్తకోటలో 15, పెబ్బేరులో 12, ఆత్మకూరులో 10,అమరచింతలో 10 వార్డులున్నాయి. ఇలా అయిదు మున్సిపాల్టీల్లో మొత్తం 80 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి.

ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు ద్వారా నాకు ఎన్నికలోంల పోటీ చేసే అవకాశం వచ్చింది. మా మండల జెడ్పీటీసీ స్థానం మహిళలకు రిజర్వేషన్ అయింది. ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గోపాల్‌పేట జెడ్పీటీసీగా గెలుపొందాను. చట్ట సభల ద్వారా అమలవుతున్న రిజర్వేన్లు మహిళలకు ఉపయోగంగా నిలుస్తున్నాయి. ఈ అవకాశాలు లేకుంటే ఇంత మంది మహిళలు బయటకు వచ్చే వారు కాదు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles