గ్రామాల్లో జోరుగా సభ్యత్వాలు


Sun,July 14, 2019 01:47 AM

దేవరకద్ర, నమస్తేతెలంగాణ: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్ సభ్యత్వాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆయా మండలంలోని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు పార్టీ సభ్యత్వాలు ముమ్మరంగా చేయిస్తున్నారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల్లో మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో పార్టీ సభ్యత్వాలు చేయించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్తలు విధిగా సభ్యత్వాలు నమోదు చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వాలు ఉన్నవారికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు బీమా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి కార్యక్త సభ్వత్వాలు చేసుకోవాలన్నారు.

కొనసాగుతున్న సభ్యత్వ నమోదు
అడ్డాకుల: మండలంలోని వివిధ గ్రామాలలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. శనివారం మండల కేంద్రంతోపాటు పొన్నకల్, రాచాలలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇల్లిల్లు తిరిగి సభ్యత్వాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదులో కొత్తకోట ముందడుగు
మదనాపురం(కొత్తకోట): టీఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సభ్యత్వాల నమోదు ప్రక్రియలో కొత్తకోట పట్టణం ముందంజలో ఉందని మండల టీఆర్‌ఎస్ నాయకులు వామన్‌గౌడ్, గుంతమౌనిక, విశ్వేశ్వర్, గాడిల ప్రశాంత్, చెన్నకేశవరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కొత్తకోటలో సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోనే సభ్యత్వాల నమోదులో కొత్తకోట పట్టణం ముందంజలో ఉందని చెప్పారు. రెండు విడతలలో 13వేలు టీఆర్‌ఎస్ సభ్యత్వాలు చేయించడం జరిగిందన్నారు. ఇంకా సభ్యత్వాలు కొనసాగిస్తామని చెప్పారు. తప్పనిసరిగా ప్రతి కుటుంబంతో సభ్యత్వ నమోదు చేయిస్తామన్నారు. గ్రామాలవారీగా పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేయ్యడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ఈ సభ్యత్వం ద్వారా ఇన్సురెన్స్ సౌకర్యం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మిషేక్, అయ్యన్న, కోండారెడ్డి, సుభాష్, ఘనీ, మధుబాబు, వెంకటేష్, భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, రజీయోద్దీన్, శాంతిరాజ్, యాదయ్య, నరేందర్, బాబా, వాహిద్, రాములు, మహేష్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...