కొత్తకోట ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి


Sun,July 14, 2019 01:45 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : బీసీ సర్పంచ్‌ను తీవ్ర అసభ్యకర పదజాలంతో దూషించి, తీవ్రంగా అవమానించిన కొత్తకోట ఎస్‌ఐ రవికాంత్ రావును సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సం ఘ ం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యు గంధర్ అన్నారు. శనివారం కొత్తకోటలో ని బీసీ భవన్‌లో నిర్విన్ సర్పంచ్ విశ్వనాథంతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ కొత్తకోటలో రెండురోజుల కిందట నిర్విన్ సర్పంచ్ విశ్వనాథం కు ఫోన్‌చేసి అకారణంగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి రెండుగంటల పాటు స్టేషన్‌లో క్రిమినల్‌లా నిల్చోబెట్టి అసభ్యకర పదాలతో బూతులు తిడుతూ, తీవ్రంగా అవమానించారని ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఆయన ప్రశ్నించారు. ఎస్‌ఐపై గతం లో కూడా అరోపణలు వచ్చాయని, కానీ ఉన్నాతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయన ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయన్నారు. ఆయన వ్యవహార శైలిపై సోమవారం ఐజీకి, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపా రు. ఎవరైనా తమ సమస్యలు చెప్పుకోవటానికి పోలీస్ స్టేషన్‌కు వస్తారని, కానీ ప్రజలకు అసలు సమస్య ఎస్‌ఐ కావడం తో ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదన్నారు.

ఒక ప్రజాప్రతినిధికే ఇలా జరిగితే మామూలు ప్రజలకు దిక్కెవరని వాపోయారు. ఉన్నాతాధికారులు ఇకనైనా స్పం దించి ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. అనంతరం సర్పంచ్ విశ్వనాథం మాట్లాడుతూ నన్ను అకారణంగా స్టేషన్‌కు పిలిచి చెప్పుకోలేని బూ తు పదాలతో తిట్టి రెండుగంటల పాటు నిల్చోబెట్టి, ఒక క్రిమినల్ లాగా చూసి తీవ్రంగా అవమానించిన ఎస్‌ఐని సస్పెం డ్ చేయాలని డిమాండ్ చేశా రు. సమావేశంలో కరాటే వెంకటేశ్, మం డలాధ్యక్షుడు అంజన్నయాదవ్, భరత్ కు మార్, నర్సింహులు, మహేష్, నరేందర్ గౌడ్, గోపాల్,ఉంపేందర్, అశోక్ పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...