హైదరాబాద్ తరహాలో.. పాలమూరు అభివృద్ధి


Sat,July 13, 2019 04:23 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : హైదరాబాద్ తరహాలో మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్, మోతీనగర్, బృందావన్ కాలనీలలో రూ.కోటీ 10 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పురపాలిక సంఘంలోని అన్ని వా ర్డుల అభివృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐదేళ్ల కాలంలోనే రూ.330 కోట్ల నిధులతో అ భివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. మినీ ట్యాంక్‌బండ్ నుంచి న్యూటౌన్ వ రకు వంతెన ఏర్పాటుతోపాటు, పట్టణంలో జంక్షన్ల అ భివృద్ధి, రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. గత కొన్నేళ్లుగా కలగా మారిన బై పాస్ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. తాను మొదటిసారి శాసన సభ్యుడిగా ఎన్నికైనప్పుడు పట్టణంలో తా గునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడే వారని గుర్తు చేశా రు. అన్ని వార్డుల్లో పర్యటించి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధజలం అందిస్తున్నామని. ఇప్పటికే ప నులు చివరి దశకు చేరాయన్నారు. బాలాజీనగర్‌లో రూ.25లక్షలు, రైల్వేస్టేషన్ ప్రాంతంలో రూ.25ల క్షలు, మోతీనగర్ చర్చి ప్రాంతంలో రూ.25 లక్షలు, బృందావన్ కాలనీ లో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్న ట్లు తెలిపారు. అలాగే, రూ.లక్షా 50వేలతో నూతనంగా ఏర్పాటు చేసిన బో రు మోటరును ప్రారంభించారు. పలు వార్డుల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని అందజేశారు. కార్యక్రమంలో మా జీ మున్సిపల్ చైర్‌పర్సన్ రా ధాఅమర్, టీఆర్‌ఎస్ పట్టణ అ ధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, మాజీ కౌన్సిలర్లు యశోద, జ్యోతి, కృష్ణమోహన్, ఖాజాపాషా, నాయకులు అమర్, సాయిలు యాదవ్, కేసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...