నేటి నుంచి మా భరోసా


Fri,July 12, 2019 03:13 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ అధికారులకు పైసలిస్తేనే పనులు చేస్తారనే మాటకు చరమగీతం పాడేందుకుగాను జిల్లాలో తొలిసారిగా మా భరోసా కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే 08542-241165 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించి తెలియజేయాలని సూచించారు.కాల్ చేసిన వ్యక్తి వివరాలను పూర్తిగా తెలియజేస్తే 24 గంటల్లో ఆ సమస్య పరిష్కారం అవుతుందా ? లేదా ? ఎందుకు కాలేదు ? అ నే దానిపై పిర్యాదుదారుడికి స్పష్టం చేస్తామన్నారు. మా భరోసా కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని రెవెన్యూ, పంచాయతీ శాఖలు ముందుకొచ్చారని కలెక్టర్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో లం చం అనే మాటను చరమగీతం పాడుతూ ప్రతి ఉద్యోగి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందన్నారు. ప్రజల్లో డబ్బులిస్తేనే తమ పనులు జరుగుతాయనే భావనను పూర్తిగా పొగొట్టేందుకు మా భరోసా కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. శుక్రవా రం నుంచి జిల్లా వ్యాప్తంగా మా భరోసా కార్యక్రమం అందుబాటులో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే కాల్‌సెంటర్‌కు మెయిల్స్, వాట్సాప్ ద్వారా సమాచారం అం దించి మీ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో నమ్మకం కలిగేలా అధికారులు ప్రతి గ్రామానికి చేరుకొని మా భరోసా కార్యక్రమం విశిష్టతను వివరిస్తారన్నారు. అనంతరం మా భరోసాకు సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆవిష్కరించారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ క్రాంతి, డీఆర్‌వో స్వర్ణలత, డీపీవో వెంకటేశ్వర్లు, రెవెన్యూ అసోసియేషన్ నేతలు రాజగోపాల్, రాజీవ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...