ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతా


Thu,July 11, 2019 05:29 AM

పాన్‌గల్: ఓటమి చెందినా నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతానని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వనమోదు కార్య క్రమంలో భాగంగా బుధవారం మండలంలోని టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని కార్యకర్తలచే నమోదు చేయించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, ఏసమస్య వచ్చినా తాను వెన్నంటే ఉండి పరిష్కారంకోసం పనిచేస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించారు. సాధించుకున్న తెలంగాణలో 70సంవత్సరాలలో జరుగని అభివృద్ధిని గడిచిన ఐదేళ్ల సాధించడం జరిగిందని తెలిపారు. అదేక్రమంలో నియోజకవర్గంలో అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రసమితి తమ పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. రెండు లక్షల చొప్పున ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తుందని పార్టీ క్యా డర్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ వెంకటేశ్ నాయుడు, సింగిల్‌విండో వైస్ చైర్మ న్ ముంతా భాస్కర్‌యాదవ్, గ్రంథాలయ డైరెక్టర్ బాలరాజు, నాయకులు గోవర్ధన్‌సాగర్, పుల్లారావు, సర్పంచులు జయరాములుసాగర్, రమేశ్, విభూతి లక్ష్యయ్య, ఎంపీటీసీలు హైమావతి, మాజీ రాంచందర్‌యాదవ్, వాల్మీకి, పెద్దబాలరాజు, దర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

వీపనగండ్లలో..
మానవత్వ విలువలకు, నిజాయితీకి కట్టుబడి ప్ర జలకు జీవితాంతం గుర్తుండే విధంగా సేవ చేయ డంలోనే సంతృప్తి ఉంటుందని మాజీ మంత్రి జూ పల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. మండల ప్రధాన నాయకులకు టీఆర్‌ఎస్ సభ్యత్వాలను అందజేశారు. కార్యక్ర మం లో ఎంపీపీ కమలేశ్వర్ రావు, మండల రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నారాయణ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బాల్ రెడ్డి మ ండల కో-ఆప్షన్ సభ్యురాలు ఎండీ మౌలానాబీ, సర్ప ంచులు వంగూరు నరసింహా రెడ్డి, నారాయణ ఎంపీటీసీలు ఇంద్రకంటి వెంకటేశ్, కాంట్రావత్ పార్వతి టీఆర్‌ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, గంగిరెడ్డి, రామ్ రెడ్డి, చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...