మున్సిపోల్స్‌పై గులాబీ నజర్


Wed,July 10, 2019 02:24 AM

మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పుర పోరులోనూ పైచేయి సాధించేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్, ప్రాదేశిక ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురేలేకుండా పోయిం ది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటి తిరుగులేని పార్టీగా అవతరించాలనే ఆలోచనంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అడుగు లు వేస్తోంది. కనీసం తమ ఉనికినైనా చాటుకునేందుకు, పరువు నిలబెట్టుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. జిల్లాలో సభ్యత్వ నమోదు ఇన్‌చార్జులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రులు, ఎ మ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు అంతా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మున్సిపాలిటీల్లో సాగుతు న్న సభ్యత్వ నమోదు కార్యక్రమం టీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల సన్నద్ధతకు ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే వార్డుల్లో సభ్యత్వాలపై గులాబీ నేతలు ప్ర త్యేక దృష్టి సారిస్తున్నారు. గతంలో కంటే సభ్యత్వాలను పెద్ద ఎత్తున పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా రు. వరుస విజయాలకు టీఆర్‌ఎస్ పార్టీ కేరాఫ్ అడ్ర స్ అని నిరూపించేందుకు నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు....

సభ్యత్వాల నమోదుతో ప్రజల్లోకి..
ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మరుసటి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 50వేల చొప్పున సభ్యత్వాలను నమోదు చేయించాలని పార్టీ లక్ష్యంగా విధించింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రా మీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీదే విజ యం అని నిరూపించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు మొదలుపెట్టారు. వార్డుల్లో గెలిచే అభ్యర్థులెవరో ఇ ప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే వార్డు మెంబర్లుగా ఉన్న కొందరిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు సర్వేల్లో తేలితే వారిని ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వకుండా గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు ముఖ్య నేతలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీల వారీగా ఇంచార్జులను నియమించేందుకు సైతం కసరత్తు నడుస్తోంది. ఓవైపు స భ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ నే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. పట్టణాల్లో అన్ని వర్గాల ప్రజలకు సభ్యత్వాలు ఇచ్చేందుకు పార్టీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళలపై ప్రత్యేకంగా దృష్టి సా రిస్తున్నారు. యువతతో పాటు కాలనీ సంఘాలు, బస్తీ సం ఘాలు, మహిళా సంఘాలు, విద్యావంతులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని సభ్యులుగా చేరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వార్డుల్లో పర్యటిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. నియోజకవర్గానికి 50 వేల టార్గెట్ ఇవ్వగా ఇప్పటికే దాదాపుగా 80శాతం మేర లక్ష్యాన్ని చేరుకున్నారు. మున్సిపాలిటీలు ఉన్న చోట సభ్యత్వాల నమోదు మరింత ఎక్కువగా ఉం టోంది. గతంలో సభ్యత్వ నమోదు కంటే ఈసారి మ రింత ఎక్కువగా చేసేందుకు నేతలంతా కలిసి ప్రయత్నిస్తున్నారు.

సభ్యత్వాలు, ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ
మున్సిపాలిటీల్లో సభ్యత్వాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధతో నేతలు ముందుకు సాగుతున్నారు. పుర పోరు నేపథ్యంలో ఓటర్ల నమోదుపైనా దృష్టి సారిస్తున్నారు. వార్డులలో కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వార్డుల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లుగా నమోదు కాని వారికి నమోదు చేయించేందుకు సాయపడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల పరిధిలో బాదేపల్లి, అచ్చంపేట మినహా 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఎన్నికల కోసం సన్నద్ధం అవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూ బ్ నగర్, భూత్పూర్, నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి, నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, అమరచింత, ఆత్మకూరు, జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అ యిజ, వడ్డేపల్లి, ఆలంపూర్ మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14న వార్డుల వారీగా తుది జాబితా ప్రకటించనున్న తరుణంలో ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు.
విజయమే లక్ష్యంగా...
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ పార్టీ నేత లు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గెలుపు గుర్రాల ను వెతికి పట్టుకుని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వార్డుల్లో గెలిచే అభ్యర్థులెవరో అ ప్పుడే సర్వేలు చేయిస్తున్నారు. నిజంగా పార్టీ కోసం కష్టపడి పనేచేసే వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి గెలిచే అభ్యర్థులకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని చెబుతున్నారు. సరైన అభ్యర్థులను వెతకడంలో పార్టీ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని సందేశం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.
అనూహ్య స్పందన వస్తోంది...
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ము న్సిపాలిటీల్లో పర్యటిస్తుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అనేక మంది టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునేందు కు స్వచ్ఛందంగా ముం దుకు వస్తున్నారు. మక్తల్, నారాయణపేట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల పరిధిలో విస్తృతంగా పర్యటిం చాం. అన్ని చోట్లా అదే స్పందన. తమ కాలనీల్లోకి వచ్చి సభ్యత్వాలు ఇవ్వమని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా టీఆర్‌ఎస్ పార్టీకి ఆదరణ లభిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాభివృద్ధి కోసం పడుతున్న తపనను ప్రజలు గమనిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధిని చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి పట్టం కట్టేందుకు మున్సిపల్ ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ, ప్రాదేశిక ఎ న్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయి. టీఆర్‌ఎస్ పార్టీ పుర పో రుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అయి ఉంది. సభ్యత్వ నమోదుతో పాటు ఓటు హక్కులేని వారికి, యువతకు ఓటు హక్కు గురించి వివరిస్తూ వారిని ఓటర్లుగా నమోదు చేయించేందుకు మా పార్టీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు.
- ఎండీ ఇంతియాజ్ ఇసాక్,

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...