పాలమూరు అభివృద్ధికి కృషి


Wed,July 10, 2019 02:19 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధే ముందున్న లక్ష్యమని రాష్ట్ర అబ్కారీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం బాలాజీనగర్, శ్రీరాంకాలనీలలో మంత్రి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ పట్టణంలో గతంలో తాగునీటికి ప్రజ లు తీవ్ర ఇబ్బందు పడేవారని, తాను గెలిచిన తరువా త మొదట తాగునీటి సమస్య పరిష్కరానికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రతి వార్డులో సమస్యలు గుర్తించడానికి మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లు, అధికారు లు కలిసి వార్డుల్లో తిరిగి సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు. ప్రతి వార్డు లో సీసీ, డ్రైనేజీలు, బీటీరోడ్ల నిర్మాణ పనులు చేశామని, మిషన్ భగీరథ పథ కం ద్వారా ప్రతి ఇంటికీ శు ద్ధజలం అందిస్తున్నామన్నా రు. ఆహ్లాదం కోసం పార్కు లు అభివృద్ధి చేశామని, మరి కొ న్ని పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి వార్డులోని సమస్యలు అధికారులు స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. శ్రీరాం కాలనీలో రూ. 20లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ సురేందర్, అర్బన్ తాసిల్దార్ వెం కటేశం, పట్టణ టీఆర్‌ఎస్ యువత అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ య శోద, వెంకటయ్య, వెంకటేష్‌గౌడ్, రాజేశ్వర్, నవకాం త్, పురుషోత్తం, పల్లెరాజు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...