సాగునీటికి ప్రాధాన్యం


Thu,June 20, 2019 03:21 AM

- నీటి పా
- వాగుల్లో చెక్‌డ్యాంల నిర్మాణం
-నీటి పారుదలశాఖ ప్రతిపాదనలు
- 40 చెక్ డ్యాంల ఏర్పాటు యత్నం
- రూ.11 కోట్ల రూపాయల వ్యయ అంచనా
వనపర్తి, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణి లక్ష్యం గా సాగునీరందించే కార్యక్రమంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు సాగునీటి భగీరథ ప్రయత్నాలను సఫలం చేస్తున్న ప్రభుత్వం ఇంకాను సాగునీటి వనరుల కల్పనలో సరికొత్త ఆలోచనలకు శ్రీకా రం చుడుతుంది. ఏడాది పొడవునా రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుం డా చేయాలన్న సంకల్పంతో కొత్త కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇంతకాలం చేయూతనివ్వని సమైక్య ప్రభుత్వాల మూ లంగా తెలంగాణలో రైతు లు నలిగిపోయిన సంగతి విధితమే. ఈ కసితోనే నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అసరమైన కార్యక్ర మాలను వి రివిగా చేపడుతున్నది. గొర్రెలు, బర్రెలు, చేపలు ఇలా సేద్యం అనుబంధరంగాలన్నింటికీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుండటం ప్రాధాన్యతగా నిలుస్తుంది.

మిషన్‌తో చెరువుల మురిపెం..
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు.. కుంటల వ్యవస్థకు మళ్లి టీఆర్‌ఎస్ సర్కా ర్ జీవం పోసింది. ఎక్కడికక్కడ నెర్రెలు బాసిన చెరువులన్నింటిని మరమ్మతులు చేసి పటిష్టం చేసింది. తెలంగాణ వ్యవసాయమంతా అత్యధికంగా చెరువులు.. కు ంటలపైనే ఆధారపడింది. నైజాం కాలం లో నిర్మించిన ఈ చెరువుల వ్యవస్థను సమైక్యపాలకులు ప్రజలకు అర్థంకాకుండానే ధ్వంసం చేయించారు. ఇలా నాశనమైన చెరువులు, కుంటల సాగునీటి వ్యవస్థకు మిషన్ కాకతీయ ద్వారా సీఎం కేసీఆర్ జీవం పోశారు. ఈ మేరకు జిల్లాలోని దాదాపు 977 చెరువులకుగాను నాలుగు విడతల్లో మిషన్ కాకతీయలో 650 చెరువులు మరమ్మతులకు నోచుకున్నాయి. తూములు, కాల్వలు, అలుగుల మరమ్మతులు చేయడంతో పాటు సారవంతమైన పూడి కమట్టిని పొలాలకు తరలించారు. ఈ మరమ్మతుల ద్వారా వర్షాకాలంలో వరద నీరు ఎక్కువ నిలిచే లా చెరువుల పనులు కొనసాగించారు. నాలుగు విడతల వారీగా చేపట్టిన పను ల్లో ఎక్కువ భాగం పూర్తిచేయడంతో నేడు చెరువులన్ని ప్రాజెక్టుల సాగునీటితో కళకళలాడుతున్నాయి. ప్ర భుత్వం ఆశించినట్లుగా చెరువులకు మరమ్మతులు చేయడం.. సాగునీరు అందించడం.. పంటలు పండించేలా తోడ్పాటునివ్వడంతో మిషన్ ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది.

40 కొత్త చెక్‌డ్యాంలకు..
మిషన్ కాకతీయ పథకం పనులను చేపట్టిన నీటిపారుదల శాఖ ద్వారా ప్రభు త్వం వాగుల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా జిల్లాలో 40 కొత్త చెక్‌డ్యాంలను ఏర్పా టు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.జిల్లాలో వాగులు.. వం కల్లో నీటి ప్రవాహాలకు అవకాశం ఉన్న చోటల్లా ఈ చెక్‌డ్యాంలను నిర్మించేందు కు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. పాన్‌గల్ మండలంలో 20 చెక్ డ్యాంలు,వీపనగండ్ల మండలంలో 11,వనపర్తి 6,రేవ ల్లి 1,ఖిల్లాఘణపురంలో 1,పెద్దమందడి మండలంలో ఒక్క చెక్‌డ్యాంల ఏర్పాటును ప్రతిపాదిస్తూ మంజూరుకై ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సర్కార్‌కు పంపింది.త్వరలోనే వీటిని ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు ఆశిస్తున్నారు. కాగా, జిల్లాలో చెక్‌డ్యాంల నిర్మాణంతో అదనంగా సాగునీటి వనరులు పెరిగే అవకాశం కలుగనుంది.

11కోట్లతో నిర్మాణాలు..
నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న 40 చెక్‌డ్యాంలకు 11 కోట్ల 33 లక్షల రూపాయల నిధులు అవ మసరమవుతాయని అధికారులు ప్రతిపాదించారు. సాగునీటి ప్రవాహాలు ఉన్న ప్రాంతాల్లో ఈ చెక్‌డ్యాంల ఏర్పాటుకు ఎక్కువగా అవకాశం ఉంది. వీటి నిర్మాణాల ద్వారా భూగర్బజలాలు పెంపొందడం.. మరికొంత భూ మి సాగులోకి రావడంలాంటి చర్యలతో చెక్‌డ్యాంలు రైతులకు మేలు చేయ ను న్నాయి. 12 లక్షల నుంచి మొదలుకొని 80 లక్షలవరకు ఒక్కొక్క చెక్ డ్యాంకు ప్రతిపాదనలు ఉన్నాయి. వాగులో ఉన్ననీటి వనరును బట్టి చెక్ డ్యాం నిర్మాణాల్లో హెచ్చు..తగ్గులున్నాయి.ఇదిలా ఉంటే, ప్రభుత్వం నుంచి నిర్మాణాలకు మంజూరు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 6 నెలల వ్యవధిలో వీటిని పూర్తిచేసేందుకు గడువు సైతం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు ఏడాది గడువుతో వచ్చే వర్షాకాలం నాటికి అన్నిచోట్ల చెక్‌డ్యాంలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇలా కొత్త చెక్‌డ్యాం నిర్మాణంతో పరిసరాల్లో భూగర్భజలాలు విస్తారంగా పెరగడం.. సాగు, తాగునీటి సదుపాయాలు మరింత మెరుగు పడటం, బోరు బావులకు సహితం ఊరటనివ్వనుంది.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...