హరితహారం నిర్వహణ బాగుంది


Thu,June 20, 2019 03:20 AM

వనపర్తి రూరల్ : జిల్లాలో హరితహారం కార్యక్రమం అమలు బాగా ఉందని కలెక్టర్ శ్వేతామొహంతిని సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ ప్రశంసించారు. బుధవారం జిల్లాలో హరితహారం కింద చేపట్టిన మొక్కలను, నర్సరీలను తనిఖీ చేశారు. కొత్తకోట-పెబ్బేరు మధ్యగల జాతీయ రహదారిపై అటవీ శాఖ ద్వారా చేపట్టిన హరితహారం మొక్కలను, వనపర్తి సమీపంలోని అటవీ ప్రాంతంలో, సవాయిగూడెం, కిష్టగిరి, అటవీ శాఖ నర్సరీలోని మొక్కలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం బాగా అమలు అవుతున్నదని, గతంతో పోలిస్తే చాలా పురోగతి ఉందన్నారు. ముఖ్యంగా అటవీశాఖ ద్వారా నాటిన మొక్కలు, నర్సరీలు అభినందించదగ్గదిగా ఉన్నాయని, ఇందుకు కృషిచేసిన కలెక్టర్ శ్వేతామొహంతి, డీఎఫ్‌వో బాబ్జిరావును అభినందించారు. జిల్లాలోని అన్ని నర్సరీల్లో మంచి పురోగతి కనిపిస్తున్నదని ప్రశంసించారు. ఈ ఏడాది హరితహారం కింద కేవలం నాణ్యమైన మొక్కలు, బతికేందుకు అస్కారం ఉన్న మొక్కలను మాత్రమే నాటాలని, నాటిన మొక్కల అన్నింటినీ కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో గణేష్ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...