ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య


Thu,June 20, 2019 03:20 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో సుశీందర్‌రావు తెలిపారు. బుధవారం అమరచింత దేశాయ్ మురళీధర్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ పాఠశాలలో ఏ ర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ము గింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న పరిస్థితి వేరు.. ఇప్పుడు న్న పరిస్థితులు వేరని, పిల్లలను సర్కారు బడికి పంపిస్తే నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలలను మరిపించేలా తల్లిదండ్రులు కోరుకున్న విద్యావిధానాన్ని విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలు బోధించరనేది కే వలం అపోహ మాత్రమేనన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంత వరకు ప్రతిభావంతులైన ఎవ్వరిని తీసుకున్నా ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినవారే ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం, భోజనం, నోటు పుస్తకాలు తదితరవన్నీ అందజేస్తున్నట్లు చెప్పా రు. ప్రభుత్వం అందజేస్తున్న వసతులు, సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బడీ డు పిల్లలను తప్పకుండా బడిలో చేర్పించాలన్నారు. ఉమ్మడి మండల్లాల్లో 2018-19 విద్యాసంవత్సరానికి గాను పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను డీఈవో అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలతో పాటు ఏఎంవో చంద్రశేఖర్, సెక్టోరియల్ ఆఫీసర్ గణేష్, ఎంఈవో భాస్కర్‌సింగ్, జీసీడీవో వసంతలక్ష్మి, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఎస్‌వో, ఎస్‌ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...