ప్రతి ఒక్కరికీ దైవచింతన ఉండాలి


Thu,June 20, 2019 03:19 AM

మదనాపురం : ప్రతి ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. మండలంలోని దుప్పల్లి గ్రా మంలోని రామాలయంలో ధ్వజస్తంభానికి, దేవతా విగ్రహాలకు బు ధవారం ఎమ్మెల్యే ఆల ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అంతరించిపోతున్న హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ.. గ్రామాల్లో నూ తన ఆలయాలు నిర్మించి దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించడం సంతోషంగా ఉం దన్నారు. ఆలయంలో ప్రతిరోజూ ధూపదీప నైవేద్యా లు జరిపించాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు సూ చించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, జెడ్పీటీసీ కృష్ణయ్య, మండల ప్రధాన కార్యదర్శి వడ్డె రాములు, ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ మణివర్దన్, ఎంపీటీసీ శాం తమ్మ, టీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, రాజవర్దన్‌రెడ్డి, మహదేవన్‌గౌడ్, వెంకట్రాము లు, వెంకటన్న, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్ ఉన్నారు.

లబ్ధిదారులకు రైతుబీమా చెక్కుల పంపిణీ..
రైతులు అకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా వారికి అండగా ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం రైతుబీమా పథకం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే ఆల అన్నారు. మదనాపురం, అజ్జకొల్లు గ్రామాలకు చెందిన సుజాత, వెంకటమ్మ, పద్మమ్మ, నాగమ్మలరూ.5 లక్షలు విలవ చేసే రైతుబీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతు పేరుమీద ప్రభుత్వమే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించడం జరిగిందని అన్నారు. అకస్మాత్తుగా కుటుంబ పెద్ద చనిపోతే, వారం రోజుల్లో ఆ కుటుంబానికి చెందిన (నామిని) పేరు మీద రూ.5లక్షలు బ్యాంకులో జమచేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ హనుమాన్ రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌నారాయణ, రైతు సంఘం గ్రామ కో-ఆర్డినేటర్లు రంగన్నయాదవ్, రాములుగౌడ్, తిరుపతయ్య, టీఆర్‌ఎస్ నాయకులు రాములు, వెంకట్‌స్వామి, కరుణాకర్, కృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...