ఉత్సాహంగా..


Thu,June 20, 2019 03:19 AM

- ఎంపీఎల్-5 టీ-20 క్రికెట్ టోర్నీ ప్రారంభం
-శుభారంభం చేసిన జేఆర్ వారియర్స్, గద్వాల బుల్స్ జట్టు
- ఒలింపిక్ సంఘం జిల్లా చైర్మన్ కేఎస్ రవికుమార్
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని ఎం డీసీఎ క్రికెట్ మైదానంలో నంది టైర్స్ మహబూబ్‌నగర్ ప్రీమియర్ లీగ్ -5 టీ-20 క్రికెట్ టోర్నీ బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలి లీగ్ మ్యా చ్‌లో పూల్-ఏలో జేఆర్ వారియర్స్ జట్టు ఫూల్ బీలో గద్వాల జట్టు శుభారంభం చేశాయి. ముందు గా ఈ పోటీలను ఒలింపిక్ సంఘం జిల్లా చైర్మన్ కేఎస్ రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు క్రికెట్‌లో రంజీకి ఎదగాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎండీసీఏ ఆధ్వర్యంలో ఎంపీఎల్ టో ర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు.

39 పరుగుల తేడాతో జేఆర్ వారియర్స్ విజయం
ఎంబీసీఏ మైదానంలో పూల్-ఏ మ్యాచ్‌లో జేఆర్ వారియర్స్ జట్టు 39 పరుగుల తేడాతో వీఎస్ జీ ఇండియన్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జేఆర్ వారియర్స్ జట్టు 19.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జ ట్టులో డేవిడ్ క్రిపాల్ 30 (30 బంతుల్లో) రవీంద్రచౌహాన్ 19, ముక్తార్ అలీ 13, హర్ష 13 పరుగులు చేశారు. వీఎస్‌జీ బౌలర్లలో కేశవ్, పటేల్, బాబా, షర్పొద్దీన్, బాబా, సాయిపవన్‌లు రెండేసీ వికెట్లు సా ధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వీఎస్‌జీ ఇండియన్ జట్టు 14.4 ఓవర్లలో 78 పరుగులకు ఆ లౌట్ అయ్యింది. జట్టులో అయ్యప్ప 24, అలీ అబర్ 17 పరుగులు చేశారు. జేఆర్ వారియర్స్ బౌలర్లలో అబీద్ హుస్సేన్ 4 వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశారు. దుర్గ 2, డేవిడ్ 1, ముక్తార్ అలీ 1 వికెట్ తీశారు. 4 వికెట్లు తీసిన ఆబిద్ హుస్సేన్ మ్యా న్ ఆఫ్‌ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.

6 పరుగులతో గద్వాల బుల్స్ జట్టు విజయం
ఫుల్-బీలో జరిగిన మ్యాచ్‌లో పీవీఆర్ షాద్‌నగర్ ఫైటర్స్‌పై గద్వాల బుల్స్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల బుల్స్ జట్టు 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యిం ది. జట్టులో మహ్మద్ ఖయ్యూ మ్ 40 (30 బంతుల్లో), రమేశ్ నాయక్ 22, అరుణ్‌కుమార్ 25,శ్రీనివాస్ 21 పరుగులు చేశారు. పీవీఆర్ ఫైటర్స్ బౌలర్లలో సాయితేజ 4, జ్ఞానేశ్వర్ 3, వెంకి రాఘవేంద్రలు రెండు వికెట్ల చొ ప్పున తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పీవీఆర్ ఫైటర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జట్టులో శ్రీకాంత్ 69 (59 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్స్) అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. జ్ఞానేశ్వర్‌సింగ్ 26, మోతీలాల్ 23 పరుగులు సాధించారు. గద్వాల బౌలర్లలో ఖయ్యూం 2, నవీన్, దినాకర్, అరుణ్‌కుమార్ చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన మహ్మద్ ఖయ్యూం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యారు. కార్యక్రమంలో క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సురేశ్ కుమార్, వెంకట్ రామారావు, గోపాలకృష్ణ, అబ్దుల్లా, బెంజిమెన్ 19ఎంబీఎన్‌ఆర్‌ః 33

ఫోటోరైటప్‌లుః
2395, 2400, 2448, 2475,2448, 2475ః తలపడుతున్న జేఆర్ వారియర్స్ వీఎస్‌జీ ఇండియన్స్ జట్లు
2485 ః నృత్యాలు చేస్తున్న చీర్ బాయ్స్
2501ః నాలుగు వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేస్తున్న జెఆర్ వారియర్స్ బౌలర్ హబిద్ హుస్సేన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేస్తున్న దృశ్యం
2527, 2528, 2530, 2537, 2540ః తలబడుతున్న గద్వాల బుల్స్ పీవీఆర్ ఫైటర్ జట్టు
19ఎంబీఎన్‌ఆర్33ఎః బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన గద్వాల క్రీడాకారుడు ఖయ్యూంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేస్తున్న దృశ్యంఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...