గద్వాల - మాచర్ల రైల్వేలైన్ నా లక్ష్యం


Wed,June 19, 2019 02:14 AM

- ఎంపీగా రాములు ప్రమాణ స్వీకారం
నాగర్‌కర్నూల్ టౌన్ : నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా పోతుగంటి రాములు ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌లో మంగళవారం తెలంగాణలోని ఎంపీలతో పాటు రాములు ప్రమాణ స్వీకారం చేశారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా అని నియోజకవర్గ పేరును ప్రస్తావిస్తూ ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా రాములు నమస్తే తెలంగాణతో మాట్లాడారు. గద్వాల - మాచర్ల రైల్వేలైన్ సాధించడం తన ప్రథమ లక్ష్యమన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కోసం కృషి చేస్తామన్నారు. సోమశిల-సిద్దేశ్వరం వంతెన కోసం నితిన్‌గడ్కరిని కలిసి విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్‌లో తన వాణి విన్పిస్తానని పేర్కొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...