ప్రమాదాల నియంత్రణే లక్ష్యం


Wed,June 19, 2019 02:13 AM

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : జిల్లాలో అగ్నిప్రమాదాల నియంత్రనే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.సుధాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూర్ అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శాఖాపరంగా చేసే తనిఖీల్లో భాగంగా వచ్చిన ఆయన సిబ్బందితో మూడు గంటలపాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన తరువాత స్పందించడం కంటే ప్రమాదా లు జరగకుండా ప్రజల్ని చైతన్యపరిచేందుకు అగ్నిమాపక శాఖ సమాయత్తమవుతుందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 ఫైర్ స్టేషన్ల పరిధిలో చైతన్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రతి శుక్రవారం ప్ర జల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అదేవిధంగా మహిళలను ఎక్కువ శాతం చైతన్యపరిచేట్లుగా ఆశ కా ర్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, అంగన్‌వాడీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు సాధ్యమైనంతగా కృషి చేయనున్నట్లు చెప్పారు.

ఉమ్మడి జి ల్లాలో మక్తల్, అలంపూర్‌లలో రెండు కొత్త ఫైర్ స్టేషన్ల ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. త్వరలో ఈ రెండు చోట్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చే అవకాశముందని చెప్పారు. జిల్లాలో అధికారుల కొరత ఉన్నప్పటికీ బాధ్యులను నియమించి వ్యవస్థను చక్కపెడుతున్నట్లు తెలిపారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు వృత్తి, శారీరక దారుఢ్యంలో పట్టు కోల్పోకుండా నిత్యం తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. అంతకుముందు అగ్నిమాపక యంత్రం పనితీరు, సిబ్బంది ద్వారా పలు రకాల విన్యాసాలను పరీక్షించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఐ రాములు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...