మొక్కల రక్షణకు చర్యలు తీసుకోవాలి


Wed,June 19, 2019 02:12 AM

పెబ్బేరు రూరల్ : మొక్కలను మొక్కుబడిగా నాటకుండా వాటి రక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని క లెక్టర్ శ్వేతామొహంతి సూచించారు. మంగళవారం ఆ మె ఉమ్మడి పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి, వెంకటాపురం, నాగసానిపల్లి గ్రామాల రహదార్ల వెంట పర్యటించారు. గతంలో నాటిన మొక్కలనే కాకుండా, కొత్తగా నాటేందుకు తీస్తున్న గుంతలను పరిశీలించారు. గతంలో రహదార్ల వెంబడి 600 మొక్కలు నాటగా, 400 బతికాయని ఏపీవో, ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు. దీంతో ఆమె స్పందిస్తూ మొక్కలను నాటి వదిలి వేయకుండా, వాటి సంరక్షణ కోసం కంచెలు ఏర్పాటు చే యాలని, ఇందుకోసం ప్రత్యేకంగా మనుషులను నియమించాలని డీఆర్‌డీవో గణేష్‌ను ఆదేశించారు. కొత్త మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్న కూలీల వివరాలను అ డిగి తెలుసుకున్నారు. ఎంత మంది కూలీలను వినియోగిస్తున్నారని, ఇప్పటికీ ఎన్ని గుంత లు తీశారని ప్రశ్నించారు. కూలీ ల హాజరు రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నదీ లేనిది తెలుసుకోవడంతో పాటు, మస్టర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 26 మంది కూ లీలకు గాను 23 మంది పనికి హాజరయ్యారని తెలుసుకొని, కూలీలు హాజరు కాకున్నా హాజరైనట్లు నమోదు చేస్తే క ఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హరితహారం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాల ని కోరారు. కార్యక్రమంలో పెబ్బేర్ తహసీల్దారు సునీ త, ఇన్‌చార్జి ఎంపీడీవో ఆంజనేయులు, ఏపీవో బాల య్య తదితరులు పాల్గొన్నారు.

మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం తగదు..
కొత్తకోట : మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ శ్వేతామొహంతి అధికారులను హెచ్చరించారు. మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పథకం కింద గుం తలు తీస్తున్న కూలీల హాజరు రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశిస్తూ కొత్తకోట, ముమ్మళ్లపల్లి గ్రా మాల రోడ్డు ఇరువైపుల నాటిన మొక్కలను పరిశీలించారు. రహదారి పక్కన నాటిన మొక్కలను పరిశీలించి గతంలో నాటిన మొక్కలు చనిపోగా వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. ముమ్మళ్లపల్లి రహదారిపై మొక్కలు నాటేందుకు ఉపాధి హమీ కూలీలను ఏర్పాటు చేయగా పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ కూలీల హాజరు రిజిస్టర్‌ను కలెక్టర్ అడిగారు. హాజరు రిజిస్టర్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పై అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధీ కూలీల హాజరు రిజిస్టర్‌ను తప్పకుండా నిర్వహించాలని లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో గణేష్, ఏపీడీ నాగశేషాద్రిసూరి, ఎంపీడీవో కతలప్ప, ఈవోపీఆర్‌డీ సుదర్శన్, ఏపీవో శేఖర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

ప్రతి మొక్కనూ బాధ్యతతో పెంచాలి..
చిన్నంబావి : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ బాధ్యతతో పెంచాలని కలెక్టర్ శ్వేతామొహంతి సూచించారు. మంగళవారం చిన్నంబావి మండలంలోని మియాపూర్ గ్రామంలో రహదారి వెంబడి మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలకు పైగా నాటాలని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో గణేష్, ఎంపీఈవో ఆంజనేయులు, ఏపీవో అప్సరున్నిసాబేగం, పంచాయతీ కార్యదర్శి ఖాదర్‌పాష పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...