నేటి నుంచి ఎంపీఎల్-5


Wed,June 19, 2019 02:12 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : ఈ నెల 19వ తేదీ నుం చి 28 వరకు మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో నందిటైర్స్ మహబూబ్‌నగర్ ప్రీమియర్ లీగ్-5 క్రికెట్ టోర్నీ జరగనున్నది. ఎంపీఎల్-5 టోర్నీని ప్రతిష్ఠాత్మకం గా నిర్వహించడానికి నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో క్రికెట్ అభిమానుల ఆహ్లాదం కోసం 2010, 2012, 2015, 2017లో నాలుగు సార్లు ఎంపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభ చాటేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. జట్టు విజేతకు రూ. 1,25,000, రన్నర్‌కు రూ. 75వేలు, మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌కు రూ.1000, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు బైక్ అందజేయనున్నారు. టోర్నీని ప్రారంభోత్సవానికి క్రీడాశాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు దేవరకద్ర, గద్వాల ఎమ్మెల్యేలు ఆలవెంకటేశ్వరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఎంపీఎల్-5 టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లను ఎండీసీఏ పూర్తి చేసింది. మైదానం చుట్టూ బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

లోగోను ఆవిష్కరించిన ఎండీసీఏ ప్రతినిధులు..
ఎంపీఎల్-5 లోగోను గురువారం ఎండీసీఏ క్రికెట్ మైదానంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యద ర్శి రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నాలుగు సార్లు టో ర్నీని విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ సారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు సురేష్‌కుమా ర్, అశోక్, గోపాలకృష్ణ, కృష్టమూర్తి పాల్గొన్నారు.

టీ-20 మ్యాచ్ వివరాలు..
19వ తేదీన మొదటి మ్యాచ్..
- జేఆర్ వారియర్స్ వర్సెస్ వీఎన్‌జీ ఇండియన్స్
- ఎంకే సైక్లోన్ వర్సెస్‌గద్వాల బుల్స్
20న రెండో మ్యాచ్..
- ఆల ఫోర్స్ వర్సెస్ మల్లేష్ బ్రదర్స్
- ఎంఎస్‌ఆన్ బ్రదర్స్ వర్సెస్ ఎంకే సైక్లోన్
21న మూడో మ్యాచ్..
- ఆల ఫోర్స్ వర్సెస్ జేఆర్ వారియర్స్
- గద్వాల బుల్స్ వర్సెస్ ఎంఎస్‌ఎన్ బ్రదర్స్
22న నాల్గో మ్యాచ్..
- వీఎస్‌జీ ఇండియన్స్ వర్సెస్ మల్లేష్ బ్రదర్స్
- ఎంకే సైక్లోన్ వర్సెస్ గద్వాల బుల్స్
24న ఐదో మ్యాచ్..
- వీఎస్‌జీ ఇండియన్స్ వర్సెస్ ఆల ఫోర్స్
- ఎంఎస్‌ఎన్ బ్రదర్స్ వర్సెస్ పీవీఆర్ ఫైటర్స్
26వ తేదీన మొదటి సెమీఫైనల్, రెండో సెమీఫైనల్.
27న ఫైనల్ మ్యాచ్.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...