జనుంపల్లిలో మిత్రుల దాతృత్వం


Tue,June 18, 2019 12:49 AM

పెబ్బేరు రూరల్: ఆ స్నేహితులు మానవత్వం చాటుకున్నారు. తమ మధ్య తిరిగిన తోటి స్నేహితుడు అకాలమృతి చెందితే ఆ కుటుంబానికి సానుభూతి మాత్రం తెలిపి వారు ఊరుకోలేదు. తమ వంతుగా బాధిత కుటుంబాన్ని ఆదుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులకు రూ. లక్షా 22 వేల నగదును అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పెబ్బేరు మండలం జనుంపల్లి సోమవారం ఈ ఘటనకు వేదికైంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బొల్లురాముడు అనేవ్యక్తి గత ఏప్రిల్ 6న ఇదే మ ండలం రంగాపురం వద్ద 44వ నంబరు జాతీయరహదారి పై ప్రమాదానికి గురై మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. ఈ నేపథ్యంలో రాముడు స్నేహితుల్లో ఒకరైనా కావలి రవి ఆ కుటుంబానికి ఎలాగైనా ఆసరాగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. మా నవతా ధృక్పథంతో స్పందించి ఇతర స్నేహితులతో చందాల రూపంలో డబ్బు లు సేకరించారు. ఆ డబ్బు మొత్తం అక్షరాల లక్షా ఇరవై రెండువేల రూపాయలైంది. ఆ డబ్బు ను గ్రామ యాదవ సంఘం భవనంలో ఏ ర్పాటుచేసిన కార్యక్రమంలో బాధితుడి భా ర్య బీసమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు తిరుపతయ్య, వెంకటన్న, రాధాకృష్ణ, జుట్టురాముడు, ధనంజేయుడు, గోపాల్, నగేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...