అక్షరాస్యత పెంపునకు కృషి చేద్దాం


Tue,June 18, 2019 12:48 AM

వనపర్తి రూరల్ : జిల్లాలో అక్షరాస్యత పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నా రు. మండలంలోని చిట్యాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం చిన్నారులకు అక్షరభ్యాస కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రతిష్ట పర్చేందుకు ఎంతోగాను కృషి చేస్తుందన్నారు. గ్రామంలోని యువత అక్షరాస్యత పెంపునకు దృష్టిసారించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులలో ఎంతో పట్టుదల ఉన్నరని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులు, ర్యాంకులు సాధించడం చాలా హర్షనీయమన్నారు. రానున్న రోజులలో జిల్లాలో అక్షరాస్యత పెంపునకు మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో ముందుకు వెళ్లాదామని తెలిపారు. అంతకుముందు ఆయన సర్పం చ్ భానుప్రకాష్ రావుతో కలిసి పాఠశాలలో సరస్వతీ మాత చిత్రపటానికి పూలమాలు వేసి చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని నాగమ్మతండా, పెద్దగూడెం గ్రామంలోని పీఎస్ పాఠశాలలో, రాజనగరంలోని ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దగూడెం, నాగమ్మతండా సర్పంచులు కొండన్న, మురళీ, ఎంఈవో వెంకటేశ్వర్ల రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, చిట్యాల ఉప సర్పంచ్ నర్సింహ, భాస్కర్‌గౌడ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...