ఉపాధ్యాయులు స్నేహభావంతో మెలగాలి


Tue,June 18, 2019 12:48 AM

ఖిల్లాఘణపురం : విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు స్నేహభావంతో మెలగాలని ఎంఈవో ఉషారాణి అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల పాఠశాలల్లో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమానికి ఆమె సర్పంచ్ వెంకటరమణతో కలిసి హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు ఈ వయస్సులో నేర్చుకున్నదానిని ఎప్పటికీ మరిచిపోరని, వారికి స్నేహభావంతో పాఠాలు బోధిస్తేనే వారు గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. చిన్న వయస్సులో బోధించిన పాఠ్యాంశాలను సులువుగా గుర్తుపెట్టుకునేలా ఉపాధ్యాయులు బోధించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే ఎంఈవో ఉషారాణీ మండలంలోని ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆర్డీఎస్ ఆధ్వర్యంలో..
మండల కేంద్రంలో ఆర్డీఎస్ సోషల్ మోబైలైజర్ వనపర్తి ఆధ్వర్యంలో సోమవారం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని వీధుల గుండా ర్యాలీగా తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, దుస్తులు, మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్రీవాణి, అంకిత, సుజాత, ఘణపురం సిటిజన్ ఫొరం మండల కన్వీనర్ గోపి, ఉపాధ్యాయులు శివరాజ్, శ్రీనివాస్, నిర్మల, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

గోపాల్‌పేటలో..
గోపాల్‌పేట : ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని ఈదమ్మగడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు పంచాయతీ కార్యదర్శి రాఘవేంధర్‌రావు అక్షరభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను దత్తత తీసుకోవడం జరిగిందని విద్యార్థులకు కావలసిన పలకలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తమ సొంత ఖర్చులతో అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు మురళీధర్‌రెడ్డి, సంధ్య పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...