ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య


Tue,June 18, 2019 12:48 AM

-ఎంపీపీ తూడి మేఘారెడ్డి
పెద్దమందడి : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎంపీపీ తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బలిజపల్లి, మంగంపల్లి, వీరాయపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమానికి చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మేఘారెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షురాలు జయంతిలు హాజరై విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వారికి ఉజ్వల భవిష్యత్‌ను అందించాలన్నారు. అనంతరం బలిజపల్లి పాఠశాలకు చెందిన విద్యార్థి శివ జాతీయ స్థాయిలో యువశాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల వారు అభినందిస్తు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి, ఎంఈవో జయశంకర్, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.

పెబ్బేరులో..
పెబ్బేరు రూరల్ : పెబ్బేరు మండలంలో బడిబాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న నినాదంతో పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తులకు అవగాహన కల్పి ంచారు. ఈ నేపథ్యంలో వారిని ప్రొత్సహించేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జనుంపల్లి గ్రామంలో ఎంపీటీసీ సునీతరాధకృష్ణ తన స్వంత ఖర్చులతో నోటుపుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిల్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసులు, సర్పంచు రాజవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే, అయ్యవారిపల్లి, సూగూరు తదితర గ్రామాల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచులు వెంకటస్వామి, స్వాతి, ఉపసర్పంచు మద్దిలేటి పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...