ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలి


Tue,June 18, 2019 12:48 AM

వనపర్తి విద్యావిభాగం : వనపర్తి మండలం పెద్దగుడెం తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉందని ఆ స్థానంలో ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ సోమవారం టీఆర్‌ఎస్ నాయకులు టీక్యానాయక్, గ్రామస్తులు డీఈవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీక్యా నాయక్ మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి టీచర్ పోస్టు ఖాళీగా ఉందని విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గిరిజనతండా పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయుని నియమించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని డీఈవోను కోరారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...