మంత్రి, కలెక్టర్లకు ఆహ్వానం


Tue,June 18, 2019 12:48 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఆయుష్ డిపార్ట్‌మెంట్ పతాంజలి, యోగా సాధన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈనె ల 19వ తేదీన యోగా నడక, అలాగే 21న 5వ అంతర్జాతీ య యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయుష్ డిపార్ట్‌మెంట్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ విశ్వనాథం తెలిపా రు. సోమవారం మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్వేతామొహంతికి వేర్వురుగా సంఘం సభ్యులు మర్యాద పూర్వకం గా కలిసి కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి శాలువా, పూల బొకేలతో సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా నోడల్ అధికారి డాక్టర్ విశ్వనాథం మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన 7 గంటలకు యోగా నడక కార్యక్రమం పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి కొత్త బస్టాండ్, బస్‌డిపో రోడ్డు గుండా రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈనెల 21వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో యోగా దినోత్సవం వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాలీలో యోగా సాధకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ ముభీన, తబసమ్, డాక్టర్ లావణ్య, పార్మాసిస్టులు సురేందర్ పటేల్, శశిధర్ ఉన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...