అదనపు కోర్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి


Tue,June 18, 2019 12:47 AM

వనపర్తి విద్యావిభాగం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో అదనపు కోర్సులను ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఓవైఎస్ టీఈఆర్ సంస్థ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ కన్వీనర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తి జిల్లాలో ప్రస్తుతం 4 పీజీ కోర్సులు మాత్రమే ఉన్నాయని ఇతర కోర్సులు లేకపోవడంతో ఇతర యూనివర్సిటీలకు, జిల్లాలకు వలస పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆర్ట్స్, సైన్స్ గ్రూ పులతో పాటు ఎమ్మెఎస్‌డబ్ల్యూ తదితర ఉపాధి అవకాశాలు పెంచే కోర్సులను ఏర్పాటు చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. వినతి ప త్రం అందజేసిన వారిలో ఆ సంస్థ సభ్యులు జాన్, ప్రవీణ్‌లున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...