నేడు రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన


Tue,June 18, 2019 12:47 AM

పెద్దమందడి : పెద్దమందడి, ఖిల్లాఘణపురం మండలాల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, సభ్యులకు మంగళవారం అవగాహన సమావేశం నిర్వహిస్తున్నట్లు రైతు సమన్వ య సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సమావేశాన్ని మండల కేంద్రంలోని మండ ల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డిలు హాజరై వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సభ్యులు, ఆయా గ్రామా ల పాత, కొత్త ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, ఏఈవోలు, కో ఆర్డినేటర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ఉద యం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...