ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి


Tue,June 18, 2019 12:47 AM

వనపర్తి క్రీడలు : సిటిజన్ ఫోరం అనేది ఒక సామాజిక ఉద్యమం అని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని డిప్యూటీ జైళ్ల శాఖ అధికారి సంపత్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సిటిజన్ ఫోరమంటే ఒక సామాజిక సంస్థ కాదు, ఒక రాజకీయ సమూహం కాదని ఇది ఒక సామాజిక ఉద్యమం అని ఆయన అన్నారు. ఈ ఉద్యమంలో అన్ని రకాల కులాలు, మతాలకు చెందిన ప్రజలను ఒకే వేదికపైకితెచ్చి, నిజమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేసే విధంగా చేయడం అని అన్నారు. సిటిజన్ ఫోరం లక్ష్యాలు వివరిస్తూ పిల్లలందరూ బడికి వెళ్లేటట్లు చూడడం, స్వచ్ఛ అభియాన్, హరితహారం కార్యక్రమాలను గ్రామాల్లో అమలు చేసి గ్రామాలను రిసార్ట్‌లుగా మార్చటం, చట్టాలపై అవగాహన కల్పించి గ్రామాలను నేరరహితంగా మార్చడం, కుల మత భాషా ప్రాంతీయ, రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం అని ఆయన వివరించారు. కార్యక్రమంలో స్టేట్ కమిటీ కన్వీనర్ శ్రీమాన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి బాలరాజు, కమిటీ సభ్యులు భద్రుద్దీన్, మండల కమిటీ సభ్యులు శ్రీనివాసులు, శైలజ, అమీర్, రాజశేఖర్, ఖాజా, గోపీ, ఇక్భాల్ పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...