నేటి నుంచి జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ


Tue,June 18, 2019 12:47 AM

వనపర్తి రూరల్ : మండలంలో పలు గ్రామాలలో 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రణాళిక పరంగా గొర్రెల, మేకలకు నట్టల మందులు వేయనున్నట్లు డాక్టర్ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నట్టల నివారణ మందులు వేయడం వల్ల గొర్రెలు, మేకల బరువు పొందవచ్చునని, పునరుత్పత్తి అధికంగా నమోదు చేయవచ్చునని, రోగ నిరోధక శక్తి పెంపొందివచ్చునని, వాటి పిల్లల మరణ శాతం తగ్గించవచ్చునని తెలిపారు. మండలంలో మూడు గ్రూప్‌ల వారిగా వైద్యులు ఏర్పాడి తేదీల వారిగా ఈనెల 18న మెంటపల్లి, పెద్దగూడెంలో, కడుకుంట్ల, 19న సవాయిగూడెం, నాచనహాళ్లీ, కిష్టగిరి, 20న రాజనగరం, రాజపేట, నాగవరం 21న అచ్యుతపురం, చిట్యాల, ఆంజనగిరి, 22న కాశీంనగర్, కాశీంనగర్ తండాలు, అప్పాయిపల్లి, 24న అంకూర్, చిమనగుంటపల్లి, వెంకటపురం, 25వ తేదీన చందాపూర్, శ్రీనివాసపురం మందులు పంపిణీ చేయబడునన్నారు. పెంపకదారులు సద్వియోగం చేసుకొవాలని పశువైద్యుడు ఆంజనేయులు తెలిపారు.

గోపాల్‌పేటలో..
గోపాల్‌పేట : జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు మండలంలోని జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు మండల పశువైద్యాధికారి ఉదయ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల వారిగా 18న గోపాల్‌పేట, చాకల్‌పల్లి, 19న ఏదుట్ల, 20న పొల్కెపహాడ్, తండాలు, 21న తాడిపర్తి, నర్సింగాయపల్లి, 22న బుద్దారం, తండాలు, 24న చెన్నూరు, తండాలు, 25న మున్ననూరు, జయన్నతిరుమలాపూర్ గ్రామాలలో జీవాలకు నట్టల నివారణ మందులు తాపనున్నట్లు తెలిపారు. గొర్రెల కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రేవల్లిలో..
రేవల్లి : మండలంలో వివిధ గ్రామాలలో బుధవారం నుంచి జీవాలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయనున్నట్లు మండల పశువైద్యాధికారి ఉదయ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రటనలో తెలిపారు. ఈనెల 19న రేవల్లి, తల్పునూర్, 20 నాగపూర్, బండరాయిపాకుల, 21న చెన్నారం, గొల్లపల్లి, 22న కేశంపేట, తండాలు, 24న చీర్కపల్లి, కొంకలపల్లి, 25న శానాయిపల్లి, గౌరిదేపల్లి గ్రామాలలో పశువైద్యాధికారులు ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...