27వ తేదీన క్రీడా పాఠశాలకు ఎంపికలు


Tue,June 18, 2019 12:47 AM

వనపర్తి క్రీడలు : క్రీడా పాఠశాలలో చేరేందుకు ఈ నెల 27వ తేదీన స్థానిక బాలకిష్ట య్య క్రీడా మైదానంలో ఎంపికలను నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి జిల్లా యువజన క్రీడల అధికారి అనిల్‌కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశాల కోసం 01.09.2010 నుంచి 31.08.2011 మధ్య జన్మించిన బాలబాలికలు తమ పాస్‌పోర్టు సైజు ఫోటోలు 10, పాఠశాల, మండల స్థాయి అధికారి నుంచి జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్‌కార్డ్, కమ్యూనిటీ సర్టిఫికెట్‌లతో రెండు సెట్ల జీరాక్స్‌లతో జిల్లా క్రీడల శాఖ కార్యాలయంలో 27న ఉదయం 8 గంటల వరకు రి పోర్ట్ చేయాలని కోరారు. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఎంపికకు అనుమతించబడదని, అలాగే తప్పుడు ధ్రువపత్రాలు అని తెలిస్తే సంబంధించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హకీంపేట్‌లోని క్రీడా పాఠశాలలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. ఎంపికల్లో ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, 30 మీటర్ల ైఫ్లెయింగ్ స్టార్ట్, షటిల్ రన్, 800 మీటర్ల పరుగు పందెంలలో విజయం సాధించాలన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...