ముమ్మరంగా మునీరాబాద్ కృష్ణ రైల్వే లైన్ పనులు


Mon,June 17, 2019 03:19 AM

మక్తల్ రూరల్: నూతన రైల్వే లైన్ పనుల్లో భాగంగా మక్తల్ నియోజకవర్గంలో రైల్వే లైన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం నుంచి మక్తల్ నియోజక వర్గంలోని కృష్ణ రైల్వే స్టేషన్ వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రైల్వే లైన్ నిర్మాణ పనులు దేవరకద్ర నుంచి మక్తల్ మండలం జక్లేర్ వరకు పూర్తయింది. అదేవిధంగా జక్లేర్ నుంచి కృష్ణ వరకు మిగిలి ఉన్న కట్ట నిర్మాణ పనులు నిరంతరం వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇట్టి నిర్మాణ పనులు పూర్తయితే మక్తల్ నుంచి హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాలకు రైల్వే సౌకర్యం ఏర్పడనుండడంతో మక్తల్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లైన్ పనులు మరో సంవత్సరంలోగా పూర్తి కానుంది. దీంతో రైలు ప్రయాణికులు నూతన రైల్వే లైన్ గుండా ప్రయాణం చేయవచ్చు. నూతన రైల్వే లైన్ పనులతో జిల్లాలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గట్టు భీముడి కుటుంబాన్ని.. పరామర్శించిన మాజీ స్పీకర్‌

గట్టు: మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి కుటుంబసభ్యులను మాజీ స్పీకర్ మధుసూధనాచారి ఆదివారం పరామర్శించారు. బలిగెరలోని ఆయన స్వగృహానికి వచ్చిన ఆయన గట్టు భీముడి భార్య భువనేశ్వరి, సోదరుడు రాష్ట్ర కన్జ్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్పతో మాట్లాడారు. భీముడి మరణంతో అధైర్యపడొద్దని మాజీ స్పీకర్ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గట్టు భీముడితో తనకున్న పరిచయాన్ని ఆయన నెమరువేసుకున్నారు. మాజీ స్పీకర్ వెంట ఖాదీబోర్డు మాజీ చైర్మన్ కాళప్ప, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది వినోదాచారి, న్యాయవాది మోనయ్య తదితరులు ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...