మహిళ కడుపులో నుంచి ఆరు కిలోల కణితి తొలగింపు


Sun,June 16, 2019 03:26 AM

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం): ఓ మహిళ కడుపులో ఉన్న ఆరు కిలోల కణితిని ఎస్వీఎస్‌ దవాఖాన వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి తొలగించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండలోని ఎస్వీఎస్‌ దవాఖాన, మెడికల్‌ కళాశాలలోని ప్రసూతి, స్త్రీ వ్యాధుల విభాగాధపతి నైమా ఫాతిమా వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లవెల్లి గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, భార్య నారమ్మకు గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఉండేదన్నారు. ఈ క్రమంలో మే 27న తీవ్ర పొత్తి కడుపు నొప్పితో ఎస్వీఎస్‌ దవాఖానలోని స్త్రీ వ్యాధి విభాగాల వైద్యులను సంప్రందించారన్నారు. పరీక్షించిన వైద్య నిపుణులు కొన్ని ప్రాథమిక పరీక్షలతో పాటు స్కాన్‌ చేయించామన్నారు. అందులో 30 నుంచి 20 సెంటీమీటర్ల పొడవైన పెద్ద గడ్డ ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని రోగి కుటుంబ సభ్యులకు వివరించామన్నారు. ఈ శస్త్రచికిత్స ఆరోగ్య శ్రీ ఫథకం కింద వర్తిస్తుందని డాక్టర్లు తెలిపారు. ఈ నెల 11న గైనిక్‌ విభాగధిపతి నైమా ఫాతిమా ఆధ్వర్యంలో ఆపరేషన్‌ చేసి ఆరు కిలోల బరువు కలిగిన పెద్ద గడ్డను పొత్తి కడుపులో నుంచి తొలగించామన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని స్త్రీ వ్యాధి విభాగాల డాక్టర్లు సూచించారు. ఈ ఆపరేషన్‌ విజయంవంతంగా చేసినందుకు రోగి తరుపు కుంటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...